తెలంగాణలోని ప్రాజెక్టులు ఫుల్..
ఎగువున ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటితో కృష్ణమ్మ ఉరకలెత్తుతోంది. దీంతో తెలంగాణలోని పలు ప్రాజెక్టుల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. జోగుళాంబ గద్వాల జిల్లాలోని జూరాల జలాశయానికి 1.15 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. దీంతో 14 గేట్లు ఎత్తి 98,896 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 318.50 మీటర్ల నీటి నిల్వ ఉంది. శ్రీశైలం జలాశయంలోకి 1,43,336 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో 4 గేట్లను ఎత్తి కుడి గట్టు జలవిద్యుత్తు కేం ద్రంలో […]
ఎగువున ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటితో కృష్ణమ్మ ఉరకలెత్తుతోంది. దీంతో తెలంగాణలోని పలు ప్రాజెక్టుల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. జోగుళాంబ గద్వాల జిల్లాలోని జూరాల జలాశయానికి 1.15 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది.
దీంతో 14 గేట్లు ఎత్తి 98,896 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 318.50 మీటర్ల నీటి నిల్వ ఉంది. శ్రీశైలం జలాశయంలోకి 1,43,336 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో 4 గేట్లను ఎత్తి కుడి గట్టు జలవిద్యుత్తు కేం ద్రంలో విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ 1,42,114క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు.
కాగా, నాగార్జునసాగర్‌కు వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. 12 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 589.90 అడుగులుగా ఉంది.
సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 175 అడుగులు కాగా, 174.57 అడుగులకు చేరుకుంది. 1,42,691 క్యూసెక్కుల నీరు వస్తుండగా.. 99,915 క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపోడుతున్నారు.
నల్లగొండ జిల్లా డిండి ప్రాజెక్టుకు 1000 క్యూసెక్కుల నీరు వస్తుండగా, అంతే మొత్తం విడుదల చేస్తున్నారు. మూసీ ప్రాజెక్టు నీటిమట్టం 644 అడుగులకు చేరుకుంది.