దేవునితో సైతం పోరు.. కేసీఆర్ భీషణ ప్రతిఙ్ఞ
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించుకునేందుకు దేవునితో సైతం కొట్లాటకు సిద్దమన్నారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. స్వరాష్ట్ర ఉద్యమం నడిచిన సాగునీరు, వ్యవసాయ రంగాల...
CM KCR ready to fight with the God for Telangana interests: తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించుకునేందుకు దేవునితో సైతం కొట్లాటకు సిద్దమన్నారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. స్వరాష్ట్ర ఉద్యమం నడిచిన సాగునీరు, వ్యవసాయ రంగాల ప్రయోజనాలను రక్షించుకునేందుకు ఎలాంటి వ్యూహాన్ని అనుసరించేందుకైనా రెడీ అని ఆయన గురువారం స్పష్టం చేశారు.
అక్టోబర్ ఆరో తేదీన నదీ జలాల వినియోగంపై జరగనున్న అపెక్స్ కౌన్సిల్ భేటీకి సన్నాహకంగా ముఖ్యమంత్రి గురువారం సాగునీటి రంగ నిఫుణులు, అధికారులు, ఇంజనీర్లు, సలహాదారులతో భేటీ అయ్యారు. ప్రగతిభవన్‌లో సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘తెలంగాణ వ్యవసాయాన్ని, రైతన్నను కాపాడుకునే విషయంలో.. దేవునితోనైనా కొట్లాటకు సిద్ధం.. తెలంగాణ ఉద్యమమే నీళ్లతో ముడిపడి సాగింది.. స్వరాష్ట్రంలో వ్యవసాయరంగంలో పండుగ వాతావరణం నెలకొన్నది.. పంటల దిగుబడిలో తెలంగాణ రైతు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాడు.. తెలంగాణ రాష్ట్రం దేశానికే ధాన్యాగారంగా మారింది.. సాగునీటి రంగాన్ని బలోపేతం చేస్తూ నదీజలాలను ఒడిసిపట్టుకొని తెలంగాణ బీళ్లను సస్యశ్యామలం చేస్తున్నాం.. ఇలాంటి తరుణంలో నదీజలాలపై తగిన హక్కు పొందే విషయంలో ఎవరితోనైనా పోరాడేందుకు సిద్దం..’’ అని ముఖ్యమంత్రి అన్నారు.
గోదావరి, కృష్ణా నదీ జలాల్లో హక్కుగా వచ్చే ప్రతీ నీటిబొట్టును కూడా వినియోగించుకొని తీరుతామని కేసీఆర్ అన్నారు. ఈ దిశగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నడుమ నదీ జలాల అంశంపై అక్టోబర్ 6న జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ రాష్ట్రం తరఫున బలమైన వాదనలు వినిపించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాన్ని ముఖ్యమంత్రి గురువారం నాటి సమావేశంలో ఖరారు చేశారు.
Also read: బ్రహ్మోత్సవాలపై టీటీడీ సంచలన నిర్ణయం
Also read: తెలంగాణలో 12 శాతం మందికి కరోనా!
Also read: పొలిట్‌బ్యూరోకు గల్లా అరుణ గుడ్‌బై.. చంద్రబాబుకు లేఖ
Also read: హైదరాబాద్‌లో మరో సినీ స్టూడియో.. ప్రకటించిన ‘అల్లు’ ఫ్యామిలీ
Also read: జాతీయ రహదారికి 500 కోట్లు.. కేటీఆర్ డిమాండ్