AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: వరంగల్ పోలీసుల అదుపులో ఇద్దరు మహిళ నక్సల్స్.. కాంగ్రెస్ నాయకుడు అరెస్ట్..

పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ఇద్దరు మహిళా మావోయిస్టులు కూడా ఉన్నట్టు తెలిసింది. కాగా, వీరిలో ఒకరు కమాండర్ స్థాయి మావోయిస్టు నేతగా సమాచారం.

Telangana: వరంగల్ పోలీసుల అదుపులో ఇద్దరు మహిళ నక్సల్స్.. కాంగ్రెస్ నాయకుడు అరెస్ట్..
Maoists
Jyothi Gadda
|

Updated on: Oct 10, 2022 | 6:49 AM

Share

బీజాపూర్ జిల్లా కాంగ్రెస్ నాయకుడితో పాటు ఇద్దరు మహిళా నక్సల్స్ ఆదివారం అరెస్ట్ అయ్యారు. వీరిని వరంగల్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలిసింది. భూపాలపట్నం బ్లాక్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఇద్దరు మహిళా నక్సలైట్లను చికిత్స నిమిత్తం తెలంగాణకు తీసుకెళ్లారు. కాంగ్రెస్ నేత కె. జి. సత్యం తీసుకువెళ్లారనే పక్కా సమాచారంతో, తెలంగాణ పోలీసుల హనుమకొండ లో అరెస్ట్ చేయగా ఇప్పటివరకు అధికారికంగా పోలీసులు ధృవీకరించలేదు. కానీ, పోలీసులు వీరిని అదుపులోకి తీసుకొని రహస్యంగా విచారిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే..

నిఘా వర్గాల పక్కా సమాచారంతో ముగ్గురు మావోయిస్టులు వారికి సహకరించిన పొరుగు రాష్ట్రానికి చెందిన ఓ నేత అరెస్టయ్యారు.. ములుగు, వరంగల్ కమిషనరేట్ పోలీసులు సంయుక్తంగా మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.. చత్తీస్ గడ్ లోని భూపాలపట్నం కు చెందిన సత్యం అనే కాంగ్రెస్ నేత సహాయంతో వీరంతా వైద్యం కోసం వస్తున్నారు.. వాజేడు, ఏటూరునాగారం మీదుగా జాతీయ రహదారి వెంట వరంగల్ కు బయలు దేరారు. ఈ క్రమంలో పక్కా సమాచారం తో వారిని పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.. వరంగల్ శివారులో వారిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ఇద్దరు మహిళా మావోయిస్టులు కూడా ఉన్నట్టు తెలిసింది. కాగా, వీరిలో ఒకరు చత్తీస్ గడ్ కు చెందిన బ్లాక్ కాంగ్రెస్ నాయకుడు ఉన్నట్టు సమాచారం. వీరిలో ఒకరు కమాండర్ స్థాయి మావోయిస్టు నేతగా సమాచారం. జ్వరంతో బాధపడుతున్న వీరికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. కోలుకున్న తర్వాత విచారించి అరెస్ట్ నిర్దారించే అవకాశం ఉంది… ఇప్పటికే మావోయిస్టు తలలకు భారీగా వెల ప్రకటించిన పోలీసులు.. అనారోగ్యంతో బాధపడుతున్న మావోయిస్టులు లొంగిపోతే మెరుగైన వైద్య సేవలు అందిస్తామంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే
29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ..ఫోర్లు, సిక్సర్లతోనే 50 కొట్టిన కోహ్లీ
29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ..ఫోర్లు, సిక్సర్లతోనే 50 కొట్టిన కోహ్లీ
ఎంతకు తెగించార్రా.. 'అమ్మ' పేరుతో మంచి మనిషిని మోసం చేశారు కదరా!
ఎంతకు తెగించార్రా.. 'అమ్మ' పేరుతో మంచి మనిషిని మోసం చేశారు కదరా!
దేశ ప్రజలకు శుభవార్త.. తక్కువ ధరకే సేవలు.. జనవరి 1 నుంచే అమల్లోకి
దేశ ప్రజలకు శుభవార్త.. తక్కువ ధరకే సేవలు.. జనవరి 1 నుంచే అమల్లోకి
శుభలేఖ పంపండి.. శ్రీవారి ఆశీస్సులు పొందండి వీడియో
శుభలేఖ పంపండి.. శ్రీవారి ఆశీస్సులు పొందండి వీడియో