చాలా అరుదు.. 5 కిలోల బరువుతో పుట్టిన పాప‌..

చాలా అరుదు.. 5 కిలోల బరువుతో పుట్టిన పాప‌..

ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలం గ‌వ‌ర్న‌మెంట్ ఆస్ప‌త్రిలో అరుదైన సంఘటన జరిగింది. ఓ ఆడ శిశువు 5 కిలోల బరువుతో జన్మించింది. తెలంగాణలోని ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కల్లూరుగూడెంకు చెందిన సౌజన్య అనే గర్భిణి నెలలు నిండగా.. పెనుబల్లి మండల గ‌వ‌ర్న‌మెంట్ ఆస్ప‌త్రికి వచ్చింది. డాక్ట‌ర్లు ఆమెకు ఆప‌రేష‌న్ చేసి పాపకు పురుడు పోశారు. పుట్టిన ఆడ శిశివు 5 కిలోల 100 గ్రాముల బరువు ఉంద‌ని డాక్టర్ రమేశ్ తెలిపారు. ఇంత బరువుతో ఒక […]

Ram Naramaneni

| Edited By: Anil kumar poka

May 10, 2020 | 3:25 PM

ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలం గ‌వ‌ర్న‌మెంట్ ఆస్ప‌త్రిలో అరుదైన సంఘటన జరిగింది. ఓ ఆడ శిశువు 5 కిలోల బరువుతో జన్మించింది. తెలంగాణలోని ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కల్లూరుగూడెంకు చెందిన సౌజన్య అనే గర్భిణి నెలలు నిండగా.. పెనుబల్లి మండల గ‌వ‌ర్న‌మెంట్ ఆస్ప‌త్రికి వచ్చింది. డాక్ట‌ర్లు ఆమెకు ఆప‌రేష‌న్ చేసి పాపకు పురుడు పోశారు.

పుట్టిన ఆడ శిశివు 5 కిలోల 100 గ్రాముల బరువు ఉంద‌ని డాక్టర్ రమేశ్ తెలిపారు. ఇంత బరువుతో ఒక శిశువు పుట్టడం అరుదైన ఘటనగా చెప్పారు. మహిళ, శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌లో ఆనస్తీషియా స్పెషలిస్ట్ డాక్టర్ రవి, సిబ్బంది శోభ, లక్ష్మి పాల్గొన్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu