Telangana Police: ఖాకీ నుంచి ఖద్దరు.. ఎన్నికల్లో పోటీకీ రెడీ అవుతున్న కొందరు పోలీసులు..ఇదిగో ఆ లిస్ట్..
Police to politician: జిల్లాను శాసించే స్థాయిలో ఉన్న ఉన్నతాధికారులు ఎమ్మెల్యేగా.. ఎంపీగా పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నారు. ఇదంతా పక్క రాష్ట్రాల్లోనివారి గురించి కాదు తెలంగాణ పోలీసులు కొందరు పక్కా ప్లాన్‌తో డ్రెస్ మార్చుకునేందుకు..
శాంతి భద్రతలను సంరక్షిస్తూ, ప్రజల జీవితాలకు, రక్షణ కల్పిస్తూ, నేరాలు, విధ్వంసాలూ జరక్కుండా కాపాడేందుకు ప్రాణాలకు తెగించి ముందుండి నడిపించేవారు పోలీస్.. అయితే ప్రజలకు రక్షణ మాత్రమే కాదు వారి మనసులు దోచుకుని వారిచే ఎన్నుకోబడాలనే కోరికతో తన డ్రెస్ కోడ్ మార్చుకునేందుకు రెడీ అవుతున్నారు.. ఖాకీ డ్రెస్ మార్చి.. ఖద్దరు చొక్కలు వేసుకునేందుకు ఉత్సాహపడుతున్నారు. వీరు మామూలు స్థాయిలో ఉండేవారు కాదు ఏకంగా జిల్లాను శాసించే స్థాయిలో ఉన్న ఉన్నతాధికారులు ఎమ్మెల్యేగా.. ఎంపీగా పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నారు. ఇదంతా పక్క రాష్ట్రాల్లోనివారి గురించి కాదు తెలంగాణ పోలీసులు కొందరు పక్కా ప్లాన్‌తో డ్రెస్ మార్చుకునేందుకు వేచిచూస్తున్నారు. తాజాగా తెలంగాణలోని కొందరు పోలీసులు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
అయితే ఓ సారు మాత్రం అడుగు ముందుకేసి అప్పుడే అసలు సంగతిని కూసేశారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ నాగరాజు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని తన మనసులో మాటను మీడియా ముఖంగా చెప్పేశారు. గత ఎన్నికల్లో వరంగల్ ఎంపీగా పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దనడంతో ఆగిపోయానని కుండబద్దలు కొట్టారు. వచ్చే ఎన్నికల నాటికి తన పదవీకాలం పూర్తవుతుందన్నారు. ఎన్నికల్లో (Telangana Elections) పోటీ చేస్తానని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కేఆర్ నాగరాజు (K R Nagaraju) స్పష్టం చేశారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మీడియాతో జరిగిన చిట్ చాట్‌లో కమిషనర్ తన మనసులోని మాటను ఇలా చెప్పేశారు. అయితే ఈ పోలీసు సార్ ఒక్కరే కాదు.. ఈ లిస్ట్ చాలానే ఉంది. వారిలో కొందరి గురించి ఇప్పుడు చూద్దాం..
నిజామాబాద్ పోలీసు కమిషనర్ – కేఆర్ నాగరాజు
సారుకు చాలా ఏళ్ల నుంచి ఖాకీ చొక్కాలు వేసుకుని వేసుకుని బోర్ కొట్టేసిందేమో.. గంజి బట్టలేసుకుని బెంజిలో దిగిన ఎంతోమందికి సెల్యూట్ చేసిన సారుకు..ఇప్పుడు పొలిటికల్ లైఫ్ మీద మనసు పడినట్లుంది. ఎప్పుడూ తాను దండాలు పెట్టడమేనా..తాను ఖద్దర్ స్థాయికొస్తే.. తనకూ ఎంతో మంది వంగి వంగి దండాలు పెడతారు కదా.. ఎంతైనా ఆ స్టైలే వేరు..అందుకే వరంగల్ కు చెందిన కేఆర్ నాగరాజు టిఆర్‌ఎస్ పార్టీ తరపున వరంగల్ ఎంపి టికెట్‌ను టార్గెట్ చేశారు. ఇప్పటికే టిఆర్‌ఎస్ హైకమాండ్ నుంచి సంకేతాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు. వరంగల్ కు చెందిన కేఆర్ నాగరాజు (Nizamabad CP K R Nagaraju) టిఆర్‌ఎస్(TRS)వరంగల్ ఎంపీ టికెట్‌పై గురిపెట్టారు. ఇప్పటికే టీఆర్‌ఎస్ హైకమాండ్ నుంచి సంకేతాలు ఉన్నాయని చెప్పుకుంటారు. టీఆర్‌ఎస్ కార్యకర్త అంటూ నిజామాబాద్ లో బీజేపీ(BJP) నుంచి విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లోనే వరంగల్ ఎంపీ టికెట్ ఆశించినప్పటికీ రాలేదు. ఇప్పుడు ఎస్పీ రిజర్వ్ అయిన వరంగల్ నుంచి ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. ఇందులో భాగంగానే టీఆర్‌ఎస్ అగ్రనేతలతో టచ్‌లో ఉంటూ పార్టీకి కావలసి పనులు విమర్శలపాలైన చేసుకుంటూ.. ముందుకెళ్తున్నారని రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
పింగిలి ప్రశాంత్ రెడ్డి – సర్కిల్ ఇన్ప్‌పెక్టర్ ఇంటిలిజెన్స్..
జనగణమన గీతాలాపన ప్రచారం చేస్తూ జనల్లోకి వచ్చిన సిఐ ప్రశాంత్ రెడ్డి(Prashanth Reddy) గత ఉప ఎన్నికల్లో హుజురాబాద్ టీఆర్‌ఎస్(TRS) టికెట్‌ఆశించారు. సీఎం కేసీఆర్(CM KCR) వరకు బయోడెటా కూడా పంపించారు. చివరి నిమిషంలో బీసీకి అవకాశంఇవ్వాలని టీఆర్‌ఎస్ భావించడం బరి నుంచి నెమ్మదిగా తప్పుకున్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట సీఐగా పనిచేసిన ప్రశాంత్ రెడ్డి జనంలో మంచి పట్టుసంపాదించారు. అందుకే వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ టికెట్ తెచ్చుకుని రాజకీయ బరిలో దిగాలని.. అది కూడా హుజురాబాద్ నుంచి గులాబీ చొక్క వేయాలని చూస్తున్నారని పొలిటికల్ సర్కిల్‌లో తెగ ప్రచారం సాగుతోంది.
అమరగాని కృష్ణయ్య గౌడ్ – డిఎస్పీ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్
టీఆర్‌ఎస్ నుంచి కోదాడ టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పటికే సామాజిక సేవా కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు డిఎస్పీ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అమరగాని కృష్ణయ్య గౌడ్. మునగాల మండల పరిధిలోని నర్సింహాపురం అయిన తమ స్వగ్రామంలో అమరగాని పౌండేషన్ పేరుతో సేవ కార్య్రకమాలు నిర్వహిస్తున్నారు. 20 ఏళ్ల క్రితమే ఈ సంస్థను ఏర్పాటు చేశారు. విద్యార్ది రాజకీయాల నుంచే పోలీసు ఉద్యోగంలో వచ్చారు. 2014లో కాంగ్రెస్ టికెట్ ఇస్తామన్న వెళ్లలేదు. ఇప్పుడు టీఆర్‌ఎస్ కోదాడ టికెట్ ఆశిస్తున్నారు. ఎప్పటికైనా ప్లస్ పాయింట్ అవుతుందని.. ఫౌండేషన్ పేరు మీద.. పేద విద్యార్దులకు ఆర్దిక సహాయం అందిండచడం, పోటీపరీక్షలకు ప్రిపెర్ అయ్యే వారికోసం.. పుస్తకాలు కొనుగోలు చేసి గ్రంధాలయాలకు ఇవ్వడం చేస్తున్నారు.. బలమైన గౌడ సామాజిక వర్గం కావడం తనకు కలిసొచ్చే అంశమంటూ ఆశగా చూస్తున్నారు. మరి టిఆర్ఎస్ బాస్ ఏమంటారో చూడాలి.
బానోత్ కాశీరాం నాయక్- ఇన్స్‌పెక్టర్ వరంగల్ పీటీసీ
అంతా అధికార పార్టీ కారు ఎక్కేందుకు రెడీ అవుతుంటే ఈయనమాత్రం కొంత డిఫ్రెంట్. తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూనే తన స్వగ్రామంతోపాటు మహబూబాబాద్ జిల్లాలో పలు కార్యక్రమాలతో మంచి పేరు తెచ్చుకున్నారు ఇన్స్‌పెక్టర్ వరంగల్ పీటీసీ బానోత్ కాశీరాం నాయక్. ఆయనే గూడూరుకు చెందిన కాశీరాం నాయక్ ప్రస్తుతం వరంగల్ పీటీసీలో ఇన్స్‌పెక్టర్‌గా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఎస్టీ నియోజకవర్గాలైన ఇల్లందు, మహబూబాబాద్‌పై ఫోకస్ పెట్టారు. ఒకవైపు మంచి పనితీరుతో దూసుకుపోతూనే మరోవైపు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రెండు నియోజకవర్గాలలో తన పరపతి పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అవకాశం వస్తే..కుమ్మేయాలని ఖాకీ డ్రస్ వదిలేసి ఖద్దర్‌లోకి రావాలని ఆరాటపడుతున్నాడు. మరి ఫ్యూచర్ ఎట్లుందో.. పార్టీ అధినేతలు ఏం డిసైడ్ చేస్తారో..ఎవరికెరికి తెలుసు.