Leap Year: లైఫ్ లాంగ్ కిక్కు కోసం ఫిబ్రవరి 29న ఇలా చేస్తున్న యువత..

జీవితం అన్నాక కాస్త థ్రిల్లింగ్ ఉండాలి. పుట్టుకైనా, పెళ్లిళ్లైనా చర్చగా నిలవాలని, సంథింగ్ స్పెషల్‎గా ఉండాలని కోరుకుంటారు. లీప్ సంవత్సరంలో పెళ్లిళ్ల కోసం ప్లానింగ్ చేసుకున్నవారు ఈ రోజు పెళ్లి పీఠలు ఎక్కబోతున్నారు. గత లీప్ సంవత్సరం ఫిబ్రవరి 29న జన్మించినవారు, పెళ్లిళ్లు చేసుకున్న వారు నాలుగేళ్లకోసారి ఘనంగా వేడుకలు నిర్వహించుకుంటూ సంథింగ్ స్పెషల్‎గా ఫీల్ అవుతున్నారు. ఏడాదికి 365 రోజులు మాత్రమే ఉంటాయి.. కానీ ప్రతీ నాలుగేళ్లకు ఒకసారి మాత్రమే 366 రోజులు వస్తాయి. అలా వచ్చే సంవత్సరాన్నే లీప్ సంవత్సరంగా పిలుస్తారు.

Leap Year: లైఫ్ లాంగ్ కిక్కు కోసం ఫిబ్రవరి 29న ఇలా చేస్తున్న యువత..
Leap Year

Edited By:

Updated on: Feb 29, 2024 | 11:07 AM

జీవితం అన్నాక కాస్త థ్రిల్లింగ్ ఉండాలి. పుట్టుకైనా, పెళ్లిళ్లైనా చర్చగా నిలవాలని, సంథింగ్ స్పెషల్‎గా ఉండాలని కోరుకుంటారు. లీప్ సంవత్సరంలో పెళ్లిళ్ల కోసం ప్లానింగ్ చేసుకున్నవారు ఈ రోజు పెళ్లి పీఠలు ఎక్కబోతున్నారు. గత లీప్ సంవత్సరం ఫిబ్రవరి 29న జన్మించినవారు, పెళ్లిళ్లు చేసుకున్న వారు నాలుగేళ్లకోసారి ఘనంగా వేడుకలు నిర్వహించుకుంటూ సంథింగ్ స్పెషల్‎గా ఫీల్ అవుతున్నారు. ఏడాదికి 365 రోజులు మాత్రమే ఉంటాయి.. కానీ ప్రతీ నాలుగేళ్లకు ఒకసారి మాత్రమే 366 రోజులు వస్తాయి. అలా వచ్చే సంవత్సరాన్నే లీప్ సంవత్సరంగా పిలుస్తారు. సాధారణంగా ఫిబ్రవరి నెలలో 28రోజులే ఉంటాయి. కానీ నాలుగేళ్లకోసారి వచ్చే లీప్ సంవత్సరంలో మాత్రం ఫిబ్రవరి మాసంలో అదనంగా ఓ రోజు వచ్చి చేరుతుంది. అలా నాలుగేళ్లకోసారి వచ్చే ఫిబ్రవరి 29 అంటే సమ్ తింగ్ స్పెషల్.

ఫిబ్రవరి 29 అంటే వారి జీవితమంతా మరిచిపోలేని మధుర జ్ఞాపకమే.. ప్రతి మనిషి నిత్య జీవితంలో ఏడాదికి ఒకసారి పెళ్లిరోజు – పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటారు. కానీ లీప్ సంవత్సరంలో జన్మించిన వారు, పెళ్లి చేసుకున్న వారు మాత్రం నాలుగేళ్లకోసారి జన్మదిన వేడుకలు, వివాహ వేడుకలు జరుపుకుంటున్నారు. వారి జీవితంలో నాలుగేళ్లకోసారి జరిగే ఈ వేడుకలు ఒక మర్చిపోలేని జ్ఞాపకం అంటున్నారు. గత లీప్ సంవత్సరంలో జన్మించిన వారు, పెళ్లిళ్లు చేసుకున్న వారు నాలుగేళ్ల నిరీక్షణ అనంతరం ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటుంటే వారి జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం పెళ్లి వేడుకలు జీవితమంతా గుర్తుండే కిక్కు ఉండాలని కొంతమంది వధూవరులు కోరిమరీ ఫిబ్రవరి 29న ముహూర్తాలు ఫిక్స్ చేసుకున్నారు. ఈరోజు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పదుల సంఖ్యలో వివాహాలు జరుగుతున్నాయి. లీప్ సంవత్సర జ్ఞాపకాలను జీవితమంతా పెనవేసుకోవాలని, వారి మూడుముళ్ల బంధం లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా ఉండాలని కోరుకుంటూ కొందరు వధూవరులు ఫిబ్రవరి 29న శుభమూర్తంగా ఫిక్స్ చేసుకొని ఈరోజు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఆ ప్రత్యేక అనుభూతిని మాటల్లో చెప్పలేమంటున్నారు. కొందరు గృహ ప్రవేశాలు, గర్భిణీ స్త్రీలు కాన్పులు కూడా ఈ రోజే చేసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..