Hyderabad crime: అనుమానమే పెనుభూతమైంది.. కన్న కొడుకు కళ్లెదుటే.. దారుణానికి పాల్పడిన తండ్రి

|

Apr 02, 2022 | 9:41 AM

భార్యా, భర్త, ఇద్దరు పిల్లలతో చక్కగా సాగిపోతున్న వారి దాంపత్యంలో అనుమాన భూతం చిచ్చు రేపింది. పచ్చని సంసారాన్ని నిలువునా కూల్చివేసింది. భర్తకు వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉందని అనుమానం పెంచుకున్న...

Hyderabad crime: అనుమానమే పెనుభూతమైంది.. కన్న కొడుకు కళ్లెదుటే.. దారుణానికి పాల్పడిన తండ్రి
Follow us on

భార్యా, భర్త, ఇద్దరు పిల్లలతో చక్కగా సాగిపోతున్న వారి దాంపత్యంలో అనుమాన భూతం చిచ్చు రేపింది. పచ్చని సంసారాన్ని నిలువునా కూల్చివేసింది. భర్తకు వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉందని అనుమానం పెంచుకున్న భార్య.. భర్తతో గొడవ(Conflict) పడింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్య(Suicide) చేసుకున్నాడు. కుమారుడి ముందే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. హైదరాబాద్(Hyderabad) లోని ఘట్‌కేసర్‌ బాలాజీనగర్‌ ప్రాంతానికి చెందిన సాయికుమార్‌ కు సునీత అనే మహిళతో 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె సంతానం. సాయి కుమార్ పోచారంలోని ఓ ఐటీ సంస్థలో పని చేస్తున్నాడు. సజావుగా సాగుతున్న వీరి దాంపత్య జీవితంలో విభేదాలు తలెత్తాయి. భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని భార్య అనుమానం పెంచుకుంది. ఈ విషయమై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. తీవ్ర మనస్తాపానికి గురైన సాయికుమార్ ఇంట్లో నుంచి బయటకెళ్లారు.

సాయంత్రం ఇంటికి వచ్చి, ఇంట్లో ఉన్న కుమారుడిని బయటకు పంపించి తలుపు వేసుకున్నాడు. అనుమానం వచ్చిన కుమారుడు కిటికీ నుంచి తలుపు తీయాలని గట్టిగా కేకలు వేశారు. కొడుకు చూస్తుండగానే సాయికుమార్ చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. విషయాన్ని తల్లికి చెప్పాడు. స్థానికులు గమనించి తలుపులు పగలగొట్టి, సాయికుమార్ ను బయటకు తీసుకువచ్చారు. చికిత్స కోసం సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతను మృతి చెందాడని డాక్టర్లు చెప్పడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింద. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Also Read

Chiranjeevi: మెగాస్టార్‌ కమిట్‌మెంట్‌ అంటే అలాగే ఉంటది.. కాలికి గాయం తగిలినా..

Mahesh- Rajamouli: మహేశ్‌తో దర్శకధీరుడి సినిమా పట్టాలెక్కేది అప్పుడే.. ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన రాజమౌళి..

Viral Video: వామ్మో.. అదేంటి గురూ అలా తిప్పేశావ్..! వీడియో చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..