Mahesh- Rajamouli: మహేశ్‌తో దర్శకధీరుడి సినిమా పట్టాలెక్కేది అప్పుడే.. ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చిన రాజమౌళి..
Mahesh Babu: ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్ విజయోత్సాహంలో ఉన్నారు దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి (Rajamouli). రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లతో రూపొందించిన ఈ భారీ మల్టీస్టారర్ చిత్రం కలెక్షన్లలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది
Mahesh Babu: ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్ విజయోత్సాహంలో ఉన్నారు దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి (Rajamouli). రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లతో రూపొందించిన ఈ భారీ మల్టీస్టారర్ చిత్రం కలెక్షన్లలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. గతంలో ఏ భారతీయ సినిమాకు రాని వసూళ్లు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఆర్‌ఆర్ఆర్ ప్రమోషన్ కార్యక్రమాల్లో చాలాసార్లు తన తర్వాతి సినిమా సూపర్ స్టార్ మహేశ్‌బాబు (Mahesh Babu)తో ఉంటుందని చెప్పిన సంగతి తెలిసిందే. ఇక నిర్మాత కే.ఎల్.నారాయణ కూడా మహేశ్- రాజమౌళి కాంబినేషన్లో సినిమా ఉంటుందని చెప్పుకొచ్చారు. దీంతో ఈ క్రేజీ కాంబోపై సినీ అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. మహేశ్‌ను రాజమౌళి ఎలా చూపిస్తారు? కథ ఏమై ఉంటుంది? అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. కాగా సుమారు రూ.800 కోట్ల భారీ బడ్జెట్‌తో జేమ్స్ బాండ్ తరహా కథతో ఈ సినిమా రూపొందనుందని కొన్ని వార్తలు కూడా వచ్చాయి. అయితే వీటిపై ఎవరూ ఎలాంటి అధికారిక ప్రకటనలు చేయలేదు. ఈ ఊహాగానాలన్నింటినీ పక్కన పెడితే ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు రాజమౌళి. మహేశ్‌తో తన సినిమా ఎప్పుడు ప్రారంభించబోతున్నారో ఒక క్లారిటీ ఇచ్చారు.
ఆ సినిమాల తర్వాతే..
‘మహేశ్‌తో సినిమా అంటే కథ పక్కాగా ఉండాలి. అందుకే ప్రీ ప్రొడక్షన్‌కు సుమారు 7 నెలల సమయం పట్టొచ్చు. అన్నీ కుదిరితే ఈ ఏడాది చివరిలో షూటింగ్‌ను పట్టాలెక్కిద్దామనుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చారు ఈ పాన్ ఇండియా డైరెక్టర్ అని చెప్పారు. ఇక మహేశ్ ప్రస్తుతం సర్కారువారి పాట సినిమాతో బిజీగా ఉన్నాడు. కీర్తిసురేశ్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు, గ్లింప్స్ ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మే 12న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో పాటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయనున్నాడు మహేశ్. బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించనుంది. ఇవి పూర్తయిన తర్వాతే రాజమౌళి సినిమా షూటింగ్ పట్టాలెక్కే అవకాశం ఉంది.
Also Read: Governor Tamilisai: ప్రగతి భవన్- రాజ్ భవన్ మధ్య విబేధాలు.. వచ్చే నెల నుంచి ప్రజాదర్బార్..
Bhadrachalam: నేటి నుంచి భద్రాద్రిలో బ్రహ్మోత్సవాలు.. రెండేళ్ల తర్వాత భక్తుల నడుమ రాములోరి కళ్యాణం
Paytm: రైలు టికెట్లు బుక్ చేసుకోండి.. డబ్బులు తర్వాత చెల్లించండి.. పేటీఎం సరికొత్త ఆప్షన్