Watch Video: ఆదిలాబాద్ సాత్నాల ప్రాజెక్టు గేట్లు ఎత్తిన అధికారులు.. వరదల్లో కొట్టుకుపోయిన రైతులు! వీడియో
ఆదిలాబాద్ జిల్లాలో ఆదివారం (సెప్టెంబర్ 8) పెను ప్రమాదం తప్పింది. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇక్కడి సాత్నాల ప్రాజెక్ట్ గేట్లను ఒక్కసారిగా అధికారులు తెరిచారు. దీంతో వరద నీరు ఉధృతంగా దిగువకు విడుదలైంది. ఈ విషయం తెలియని కొందరు రైతులు వదర నీటిలో చిక్కుకుపోయారు. రైతులతోపాటు పశువులు కూడా పదుల సంఖ్యలో వరద నీటిలో కొట్టుకుపోయాయి..
ఆదిలాబాద్, సెప్టెంబర్ 8: ఆదిలాబాద్ జిల్లాలో ఆదివారం (సెప్టెంబర్ 8) పెను ప్రమాదం తప్పింది. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇక్కడి సాత్నాల ప్రాజెక్ట్ గేట్లను ఒక్కసారిగా అధికారులు తెరిచారు. దీంతో వరద నీరు ఉధృతంగా దిగువకు విడుదలైంది. ఈ విషయం తెలియని కొందరు రైతులు వదర నీటిలో చిక్కుకుపోయారు. రైతులతోపాటు పశువులు కూడా పదుల సంఖ్యలో వరద నీటిలో కొట్టుకుపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆదిలాబాద్ జిల్లాలో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సాత్నాల ప్రాజెక్టు గేట్లను అధికారులు తెరవడంతో ఒక్కసారిగా వచ్చిన వరద నీరు పెండల్ వాడ వాగులో ఉప్పొంగింది. అయితే అప్పటి వరకూ వాగులో నీరు తక్కువగా ఉండటంతో అటుగా వెళ్తున్న కొందరు రైతులు కొట్టుకుపోయారు. నానాతిప్పలుపడి చివరికి ఎలాగోలా క్షేమంగా బయటపడ్డారు. రైతులతోపాటు అదే వాగులో కొన్ని పశువులు కూడా ఉన్నాయి. వరద దాటికి అవికూడా కొట్టుకుపోయే పరిస్థితి నెలకొంది. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.
ముందస్తు సమాచారం లేకుండా సాత్నాల ప్రాజెక్టు గేట్లు తెరిచిన అధికారులు
వరదల్లో కొట్టుకుపోయిన రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో శనివారం ముందస్తు సమాచారం లేకుండా సాత్నాల ప్రాజెక్టు తెరవడంతో పెండల్ వాడ వాగులో కొట్టుకుపోయిన రైతులు.. చివరికి క్షేమంగా బయటపడ్డ రైతులు. pic.twitter.com/Pg6gGAXwi9
— Telugu Scribe (@TeluguScribe) September 8, 2024
అధికారులు విధుల నిర్వహణలో చూపే అసమర్ధత, నిర్లక్ష్యం జనాల ప్రాణాల మీదకు తెచ్చిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గేట్లు ఎత్తే ముందస్తు కనీసం సమాచారం ఇవ్వాలన్న ఇంగిత జ్ఞానం కూడా అధికారులకు లేకుండా పోయిందంటూ మండిపడుతున్నారు.