Telangana: దొంగలకు ‘డిజిటల్’ ఉచ్చు.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టించిన ఒక్క మెసేజ్!
రైతులు టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటున్నారు.. దొంగల బెడద నుండి విముక్తికోసం అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. వారిని ఆవలీలగా పట్టేస్తున్నారు. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వెలుగుచూసిన ఈ సంఘటన ఎందుకు నిదర్శనం. ఆ రైతుల ఐడియా అదరహో అనిపించింది..

రైతులు టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటున్నారు.. దొంగల బెడద నుండి విముక్తికోసం అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. వారిని ఆవలీలగా పట్టేస్తున్నారు. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వెలుగుచూసిన ఈ సంఘటన ఎందుకు నిదర్శనం. ఆ రైతుల ఐడియా అదరహో అనిపించింది.. పంట పొలాల వద్ద విద్యుత్ మోటార్లు, వైర్లు, ట్రాన్స్ ఫార్మర్స్ ఎత్తుకెళ్తున్న దొంగలు అడ్డంగా బుక్కయ్యారు. ఒక్క మెసేజ్ వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టించింది. అర్దరాత్రి రైతులు అలెర్ట్ అయ్యేలా చేసింది. ఇద్దరు దొంగలను పట్టుకున్న రైతులు వారిని పోలీసులకు అప్పగించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని మొరంచవాగు పరిసర ప్రాంతాల్లో దొంగల బెడద ఎక్కువయింది. వ్యవసాయ బావుల వద్ద మోటార్లు, విద్యుత్ వైర్లు, ట్రాన్స్ ఫార్మర్స్‌లో కాపర్ వైర్లను దొంగిలిస్తున్నారు. దొంగల సమస్యకు ఎలాగైనా ముగింపు పలకాలని భావించిన రైతులు.. అందరూ కలిసి పొలాల వద్ద ఆధునిక టెక్నాలజీ మిషన్ డిటెక్షన్ సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈక్రమంలోనే గురువారం (ఏప్రిల్ 30) రాత్రి తమ పాత బుద్ధినే ప్రదర్శిస్తూ దొంగలు మళ్లీ చోరీకి ప్రయత్నించారు. అయితే, ఆ ప్రాంతంలో దొంగల కదలికలు క్యాప్చర్ సిసి కెమెరాలు వెంటనే రైతుల మొబైల్ ఫోన్లకు అలర్ట్ మెసేజ్ పంపాయి. ఒక్క మెసేజ్‌తో అప్రమత్తమైన రైతులందరూ క్షణాల్లో ఏకమయ్యారు.
ఇంకేముంది.. ఆ దొంగల పాపం పండింది..అర్దరాత్రి రైతులంతా పొలాల వద్దకు చేరుకుని కేటుగాళ్లను వెంటాడి పట్టుకన్నారు. వారిని స్తంభానికి కట్టేశారు. పోలీసులకు అప్పజెప్పి దొంగల బెడద నుండి ఊపిరి పీల్చుకున్నారు. సీసీ కెమెరాల అలర్ట్‌తో రైతులకు దొంగల బెడద నుండి విముక్తి లభించింది.. టెక్నాలజీని సద్వినియోగం చేసుకున్న ఈ రైతులు ఇప్పుడు ఆ జిల్లాలో హాట్ టాపిక్ అయ్యారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
