శ్రీశైలం మృతుల కుటుంబాలకు పరిహారం పెంపు

శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు చెల్లించే పరిహారాన్ని పెంచారు. బాధిత విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలకు ప్రభుత్వం అందించే ఎక్స్ గ్రేషియాకు అదనంగా మరో..

శ్రీశైలం మృతుల కుటుంబాలకు పరిహారం పెంపు
Follow us

|

Updated on: Sep 05, 2020 | 7:28 PM

శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు చెల్లించే పరిహారాన్ని పెంచారు. బాధిత విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలకు ప్రభుత్వం అందించే ఎక్స్ గ్రేషియాకు అదనంగా మరో రూ.75 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు తెలంగాణ జెన్ కో- ట్రాన్స్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు ప్రకటన చేశారు. శనివారం తెలంగాణ జెన్ కో బోర్డు సీఎండీ ప్రభాకర్ రావు అధ్యక్షతన విద్యుత్ సౌధలో జ‌రిగిన స‌మావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రమాదంలో మరణించిన డీఈ కుటుంబానికి రూ. 1.25 కోట్లు, మిగతా ఉద్యోగుల కుటుంబాలకు రూ.1 కోటి రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందుతుందన్నారు. మరణించిన ఉద్యోగుల కుటుంబసభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. ఇతర శాఖాపరమైన సహాయం కూడా త్వరితగతిన అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. సీఎండీతో పాటు డైరెక్టర్లు, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. కాగా, శ్రీశైలం పవర్ ప్రాజెక్ట్ అగ్ని ప్రమాదంలో 9 మంది మృతి విగతజీవులయ్యారు.