Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో మరో అరెస్టు.. గౌతమ్‌ మల్హోత్రాను అదుపులోకి తీసుకున్న ఈడీ

మంగళవారం (ఫిబ్రవరి 7) హైదరాబాద్‌లో బుచ్చిబాబును అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు రాత్రే అతనిని ఢిల్లీ తరలించారు. తాజాగా ఇదే కేసులో మరొకరు అరెస్ట్‌ అయ్యారు.

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో మరో అరెస్టు.. గౌతమ్‌ మల్హోత్రాను అదుపులోకి తీసుకున్న ఈడీ
Enforcement Directorate

Updated on: Feb 08, 2023 | 12:13 PM

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో సీబీఐ, ఈడీ దూకుడు పెంచాయి. విచారణలో భాగంగా ఇవాళ ఉదయం హైదరాబాద్‌కు చెందిన ఛార్టెర్డ్‌ అకౌంటెంట్‌ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అరెస్ట్ చేసింది. మంగళవారం (ఫిబ్రవరి 7) హైదరాబాద్‌లో బుచ్చిబాబును అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు రాత్రే అతనిని ఢిల్లీ తరలించారు. తాజాగా ఇదే కేసులో మరొకరు అరెస్ట్‌ అయ్యారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్‌తో సంబంధమున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటోన్న ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ మల్హోత్రాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం అరెస్టు చేసింది. కాగా ఇవాళ మధ్యాహ్నం మల్హోత్రాను సీబీఐ  ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు. అలాగే ఈ స్కామ్ కు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు అతనిని  కస్టోడియల్ రిమాండ్ కోరనుంది ఈడీ. కాగా గౌతమ్‌తో కలిసి ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో ఇప్పటివరకు మొత్తం తొమ్మిది మంది అరెస్ట్‌ అయ్యారు. శిరోమణి అకాలీదళ్ మాజీ ఎమ్మెల్యే దీప్ మల్హోత్రా కుమారుడు గౌతమ్ మల్హోత్రా..  పలువురు మద్యం వ్యాపారులతో సన్నిహిత సంబంధాలున్నట్లు ఆరోపణులు ఎదుర్కొంటున్నారు.

కాగా లిక్కర్ స్కామ్‌ కేసులో ఇది తొమ్మిదో అరెస్ట్. ఇప్పటి వరకు సీబీఐ  ఎనిమిది మందిని అరెస్ట్ చేసి వారి నుంచి వివరాలు రాబట్టింది. సమీర్ మహేంద్రు, విజయ్ నాయర్, శరత్ చంద్రారెడ్డి, అభిషేక్ బోయినపల్లి, దినేష్ అరోరా, బినోయ్ బాబు, అమిత్ అరోరా, గోరంట్ల బుచ్చిబాబు.. గతంలో అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు..

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..