Telangana: కొండగుహ నుంచి వింత శబ్దాలు.. పొలం పని చేస్తోన్న రైతులు అటుగా వెళ్లి చూడగా..
చిన్న పామును చూస్తేనే దెబ్బకు ఉలిక్కిపడి పరుగులు పెడతాం. అలాంటిది ఏకంగా భారీ సైజ్‌లో ఉన్న కొండచిలువ ఎదురుపడితే..
చిన్న పామును చూస్తేనే దెబ్బకు ఉలిక్కిపడి పరుగులు పెడతాం. అలాంటిది ఏకంగా భారీ సైజ్‌లో ఉన్న కొండచిలువ ఎదురుపడితే.. ఇంకేముంది పైప్రాణాలు పైనే పోతాయి. అక్కడ ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 11 కొండచిలువలు గ్రామస్థులను కలవర పెట్టాయి. ఒకటి అనుకుంటే.. అటవీ ప్రాంతం నుంచి దారి తప్పి.. పొలాల్లోకి వచ్చిందని అనుకోవచ్చు. కానీ ఒకే ప్రాంతంలో భారీ సైజ్‌లో ఉండే 11 కొండచిలువలను స్థానికలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
అసలు విషయానికొస్తే.. తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో కొండచిలువలు కలకలం రేపాయి. లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేటలో 11 కొండచిలువలు.. ఒకటి తర్వాత ఒకటిగా కనిపించి గ్రామస్థులను కలవరపెట్టాయి. గ్రామ శివార్లలో ఉన్న చెరువు సమీపంలోని పొలాల మధ్య ఉన్న ఓ కొండపై గుహ లాంటి ప్రదేశంలో ఏకంగా 11 కొండచిలువలను గుర్తించారు గ్రామస్తులు. ఇది మూడు నెలల క్రితం జరగగా.. ఆ సమయంలో వాళ్లు వెంటనే అప్రమత్తమై అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. అధికారులు గ్రామానికి చేరుకుని కొండచిలువలను పట్టి అడవిలో వదలడంలో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.
అయితే ఇప్పుడు మళ్లీ అదే ప్రాంతంలో రైతులకు మరో కొండచిలువ కనిపించింది. దీంతో వారి కంటి మీద కునుకు లేకుండాపోయింది. కొండచిలువ గురించి అటవీ శాఖ సిబ్బందికి సమాచారాన్ని అందించారు స్థానికులు. అసలు ఈ కొండచిలువలు ఎక్కడ నుంచి ఇక్కడి చేరుకుంటున్నాయి.? ఈ ప్రాంతాన్ని ఆవాసంగా చేసుకుంటే.. జనాలకు ప్రమాదం పొంచి ఉండొచ్చునని స్థానికులు భయందోళనలు చెందుతున్నారు. కాగా, ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
