Watch Video: వామ్మో‌ గ్రామాల్లో ఏనుగు కలకలం.. పంటపొలాల్లో బీభత్సం..

కాగజ్‎నగర్ కారిడార్‎లో ఏనుగు బీభత్సం సృష్టించింది. మహారాష్ట్ర గడ్చిరోలి అభయారణ్యం నుంచి‌ దారి తప్పి కరంజి అభయారణ్యంలోకి ఎంట్రీ ఇచ్చిన ఓ ఏనుగు కొమురంభీం జిల్లా చింతలమా‌‌నపల్లి మండలంలో కలకలం రేపింది. ప్రాణహిత దాటి చింతలమానపల్లి మండలం బూరెపల్లి పంటపొలాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఏనుగు.. మిర్చి పంటలో భీభత్సం సృష్టించింది.

Edited By:

Updated on: Apr 03, 2024 | 8:08 PM

కాగజ్‎నగర్ కారిడార్‎లో ఏనుగు బీభత్సం సృష్టించింది. మహారాష్ట్ర గడ్చిరోలి అభయారణ్యం నుంచి‌ దారి తప్పి కరంజి అభయారణ్యంలోకి ఎంట్రీ ఇచ్చిన ఓ ఏనుగు కొమురంభీం జిల్లా చింతలమా‌‌నపల్లి మండలంలో కలకలం రేపింది. ప్రాణహిత దాటి చింతలమానపల్లి మండలం బూరెపల్లి పంటపొలాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఏనుగు.. మిర్చి పంటలో భీభత్సం సృష్టించింది. మిర్చి తోటలో పని చేస్తున్న బూరెపల్లి గ్రామానికి చెందిన అల్లూరి శంకర్ (50) రైతుపై దాడి చేసింది. ఈ దాడిలో రైతు అక్కడికక్కడే మృతి చెందాడు.

రైతుపై దాడి చేసి గ్రామంలోకి ఏనుగు ఎంట్రీ ఇవ్వడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ‌ఇచ్చి‌న స్థానికులు కర్రలతో ఏనుగును అభయారణ్యంలోకి తరమారు. ఘటన స్థలానికి‌ చేరుకున్న ఫారెస్ట్ అధికారులు ఏనుగును మహారాష్ట్ర వైపు మళ్ళించే ప్రయత్నాలు చేశారు. ప్రాణహిత దాటి తిరిగి‌ ఏనుగు మహారాష్ట్ర గడ్చిరోలి అభయారణ్యంలోకి వెళ్లే అవకాశం ఉందంటూ తెలిపారు అటవిశాఖ అధికారులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..