AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Employees Protest: విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయం… కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళనలు…

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్‌ శాఖ ఉద్యోగులు, కార్మికులు ఆందోళనకు దిగారు. కింది స్థాయి కార్మికుల నుంచి ఉన్నత స్థాయి...

Employees Protest: విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయం... కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళనలు...
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 03, 2021 | 5:49 PM

Share

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్‌ శాఖ ఉద్యోగులు, కార్మికులు ఆందోళనకు దిగారు. కింది స్థాయి కార్మికుల నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిక ప్రాంతాల్లో విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ చర్యలను నిలిపివేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేశాయి. రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా హైదరాబాద్‌ విద్యుత్‌ సౌధ వద్ద ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కేంద్రం బిల్లు నేపథ్యంలో…

విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం స్టాండర్డ్‌ బిడ్డింగ్‌ డాక్యుమెంట్‌ ప్రవేశపెట్టింది. ఈ బిల్లును కేంద్రం ఉపసంహరించుకోవాలని తెలంగాణ విద్యుత్ సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఈ మేరకు విద్యుత్‌ రంగంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆందోళనలకు పిలుపునిచ్చారు.

రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు…

హైదరాబాద్‌ విద్యుత్‌ సౌధ వద్ద ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. నాగార్జునసాగర్‌ జెన్‌కో కార్యాలయం ఎదుట విద్యుత్‌ ఉద్యోగుల ఐకాస ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు. వరంగల్‌లో విధులు బహిష్కరించి చెల్పూర్‌ కాకతీయ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ (కేటీపీపీ) వద్ద ధర్నా నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కార్మికుల నుంచి ఉన్నత అధికారుల వరకు నిరసనలో పాల్గొన్నారు. జగిత్యాల విద్యుత్ ఐకాస ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. నిర్మల్‌ విద్యుత్‌ కార్యాలయం వద్ద ఉద్యోగులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అదానీ, అంబానీలకు విద్యుత్ రంగాన్ని కట్టబెట్టడానికే ఈ ప్రైవేట్ బిల్లును కేంద్రం తీసుకొస్తోందని ఉద్యోగులు ఆరోపించారు. విద్యుత్‌ రంగాన్ని బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్‌ ఎన్నో సంస్కరణలు తీసుకొస్తుంటే.. కేంద్రం మాత్రం రాష్ట్రాల హక్కులను లాక్కునేందుకు ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు.

Also Read:

Rohingya Immigrants: దేశంలోని 12 రాష్ట్రాల్లో రోహింగ్యాలు… ప్రకటించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి…

నర్సిరెడ్డి కుటుంబానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆర్థిక సాయం… పిల్లలను చదివిస్తానని హామీ…

Hyderabad Metro: మెట్రో అధికారులను అభినందించిన కేటీఆర్… అవయవ దానానికి ముందుకు రావడంపై ప్రశంస…