AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Election: తెలంగాణ ఎన్నికల్లో ఈసీ కీలక నిర్ణయం.. సహాయకుడిగా వచ్చే వారికి ఇంక్ తప్పనిసరి..!

తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లను ఈసీ సమీక్షించింది. ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు పాటించాల్సిన రూల్స్ విషయంలో కొన్ని సూచనలు, నిబంధనలు జారీ చేసింది ఎన్నికల కమిషన్. ఈ నేపథ్యంలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసీ కీలక మార్పులు చేసింది. ఓటు వేయలేని వారికి సహాయకుడిగా వచ్చే వారి కుడి చేతి చూపుడు వేలుకు ఇకపై ఇంకు పెడతారు.

Telangana Election: తెలంగాణ ఎన్నికల్లో ఈసీ కీలక నిర్ణయం.. సహాయకుడిగా వచ్చే వారికి ఇంక్ తప్పనిసరి..!
Voting
Balaraju Goud
|

Updated on: Nov 08, 2023 | 11:31 AM

Share

తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లను ఈసీ సమీక్షించింది. ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు పాటించాల్సిన రూల్స్ విషయంలో కొన్ని సూచనలు, నిబంధనలు జారీ చేసింది ఎన్నికల కమిషన్.

తెలంగాణ ఎన్నికల్లో ఈసీ కీలక మార్పులు చేసింది. ఓటు వేయలేని వారికి సహాయకుడిగా వచ్చే వారి కుడి చేతి చూపుడు వేలుకు ఇకపై ఇంకు పెడతారు. సహాయకుడు అదే బూత్‌కు చెందిన ఓటరై ఉండాలి. తన ఓటు వేశాకే మరొకరికి సహాయకుడిగా వెళ్లాలి. ఓటు వేసేటప్పుడు ఎడమ చేయి చూపుడు వేలుకు ఇంకు పెడతారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ కీలక మార్పులు చేసింది.

తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. అందరూ ఎన్నికల కోడ్ పాటించాలని సూచించింది ఎన్నికల కమిషన్. నిబంధనలు పాటించకపోతే కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ప్రచారంలో భాగంగా అన్ని రాజకీయ పార్టీలు సువిధ యాప్ ద్వారా ముందస్తు పర్మిషన్ తీసుకోవాలన్నారు. సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించే స్థలం, సమయం తదితర వివరాలను స్థానిక పోలీస్ అధికారులకు తెలియజేయాలని తెలిపారు. కుల, మత, భాషలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేయకూడదని ఈసీ స్పష్టం చేసింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లను వినియోగించకూడదన్నారు.

నవంబర్ 10వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. అఫిడవిట్ లోని అన్ని కాలమ్స్‌ను తప్పనిసరిగా అభ్యర్థులకు సూచించారు. నామినేషన్ పత్రాలను ఆన్ లైన్ ద్వారా కూడా స్వీకరించడం జరుగుతుందని ఈసీ స్పష్టం చేసింది. పోటీలో ఉండే అభ్యర్థులు తమ క్రిమినల్ రికార్డులను  లీడింగ్ న్యూస్ పేపర్స్, టీ.వీ ఛానళ్లలో పబ్లిష్ చేయాలని తెలిపారు. ఎన్నికల ప్రచారానికి అయ్యే ఖర్చును అధ్యయనం చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధుల బృందం రాష్ట్రంలో ఇప్పటికే పర్యటిస్తోంది. అటు ఈసారి ఉదయం 5.30 గంటల నుంచే మాక్ పోలింగ్ ప్రారంభిస్తారు. పోలింగ్ ఏజెంట్లుగా సర్పంచ్, వార్డు సభ్యులు కూడా కూర్చునేందుకు అవకాశం కల్పించింది ఎన్నికల కమిషన్. మరోవైపు పోలింగ్ శాతం పెంచే అంశంపైనా ఈసీ కసరత్తు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు సదస్సులు నిర్వహించే ఏర్పాట్లు చేస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…