AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పొట్లంలో చుట్టేప్పుడు బంగారు గొలుసు – ఓపెన్ చేసినప్పుడు చిన్నపాటి కంకర – పురుగులు పడి పోతార్రా

నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని అంబకంటి గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు రాజవ్వ, గోవింద్‌లను ముగ్గురు ఆగంతకులు బురిడి కొట్టించి రెండు తులాల బంగారు చైన్‌ను సినీ ఫక్కీలో అపహరించుకుపోయారు. వృద్ధ దంపతుల అమాయకత్వాన్ని అనుకూలంగా మలుచుకుని దోచుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. 

Telangana: పొట్లంలో చుట్టేప్పుడు బంగారు గొలుసు - ఓపెన్ చేసినప్పుడు చిన్నపాటి కంకర - పురుగులు పడి పోతార్రా
Oldage Couple
Naresh Gollana
| Edited By: Ram Naramaneni|

Updated on: Jun 17, 2025 | 2:40 PM

Share

వృద్ధ దంపతులు తమ సమీప బందువు ఇంట్లో జరుగుతున్న శుభ కార్యక్రమంలో పాల్గోనేందుకు గాను మంగళవారం మధ్యాహ్నం వేళలో బస్సులో బైంసాకు వచ్చారు. స్థానిక పిప్రి కాలనీ బస్టాండ్ వద్ద బస్సు దిగి కాలనీ వైపు నడుచుకుంటూ వెలుతుండగా అక్కడి మార్గంలో ద్విచక్ర వాహనంతో కాపు కాచి ఉన్న ముగ్గురు ఆగంతకులు వృద్ధ జంటను ఆపి తాము అధికారులమంటూ మాటలు కలిపారు.

ఆ ముగ్గురిలో ఒకరు.. మిగిలిన ఇద్దరితో సంబంధం లేని వ్యక్తిగా నటించాడు. చోరీలు అధికమైన దృష్ట్యా బంగారు చైన్ను మెడలో నుంచి తీసివేసి లోపల పెట్టుకోవాలంటూ అటుగా వెళ్తున్నవారికి సూచిస్తున్నట్లు మిగిలిన ఇద్దరు నటించారు. అగంతకులలో ఒకడు ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం తాను ధరించిన బంగారు చైన్, రెండు ఉంగరాలను తీసి ఇవ్వగా.. మిగతా ఇద్దరు అగంతకులు వాటిని పేపర్ పొట్లంలో వేసి ఇచ్చారు. వాటిని తీసుకొని వృద్ధ దంపతుల ముందు నుంచి మూడవ ఆగంతకుడు అక్కడి నుంచి నడుచుకుంటూ ముందుకు వెళ్లిపోయాయి.

ఇది చూసిన వృద్ధ దంపతులు నిజమని నమ్మి అగంతకులు చెప్పినట్టే చేసారు. వృద్ధురాలు రాజవ్వ తాను ధరించిన బంగారు చైన్‌ను మెడలో నుంచి తీసివేయగా ఆగంతడొకరు తాను పేపర్ పోట్లంలో పెట్టి ఇస్తానని నమ్మించి ఆ గొలుసు తీసుకున్నారు. మరో అగంతకుడు వృద్ధ దంపతులను మాటల్లో పెట్టగా..  చైన్ తీసుకున్నవాడు దాన్ని దాచిపెట్టి ముందుగాను తాను సిద్ధం చేసి ఉంచుకున్న మట్టి పెట్టి చుట్టిన పేపర్ పొట్లాన్ని అందించి సంచిలో వేసుకోవాల్సిందిగా సూచించాడు. దీంతో వృద్ధురాలు అగంతకులు అందించిన మట్టి పేపర్ కవరును సంచిలో వేసుకొని నడుచుకుంటూ బంధువుల ఇంటి వైపు వెళ్లింది. ఇదే సమయంలో ఆ గంతకులు బైక్‌పై అక్కడి నుంచి ఉడాయించారు. కొద్ది  దూరం వెళ్లిన అనంతరం వృద్ధుడు గోవింద్ పేపర్ పోట్లం తీసి బంగారు చైన్ వేసుకోవాల్సిందిగా భార్య రాజవ్వకు సూచించారు. వెంటనే వృద్దురాలు పొట్లం విప్పి చూడగా అందులో బంగారు చైన్‌కు బదులుగా మట్టి, చిన్నపాటి కంకర కనిపించడంతో ఖంగుతిని తాము మోసపోయినట్లుగు గుర్తించి లబోదిబోమన్నారు. రోదిస్తూ తాము మోసపోయిన వైనాన్ని బంధువులకు సమాచారం అందించారు. సంబంధిత సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు ఘటన స్థలికి చేరుకొని వృద్ధ దంపతుల నుంచి వివరాలు సేకరించారు. అగంతకుల అచూకి కోసం గాలింపు చర్యలను చేపట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..