Warangal: బిడ్డల కోసం ఆస్ట్రేలియా నుంచి చాక్లెట్లు తెచ్చిన తండ్రి.. అది తిన్న బాలుడు..

|

Nov 27, 2022 | 7:15 AM

తండ్రి.. తన బిడ్డల కోసం ఎంతో ఇష్టంతో విదేశాల నుంచి చాక్లెట్లు తీసుకువచ్చాడు. వాటిని చూసి.. ఆ బిడ్డల ఆనందం అంతా ఇంతా కాదు.. అయితే.. ఆ చాక్లెట్లను ఓ బాలుడు వాటిని తీసికెళ్లి స్కూల్లో దిందామనుకున్నాడు.. కానీ..

Warangal: బిడ్డల కోసం ఆస్ట్రేలియా నుంచి చాక్లెట్లు తెచ్చిన తండ్రి.. అది తిన్న బాలుడు..
Warangal Crime
Follow us on

Eight-year-old boy dies: తండ్రి.. తన బిడ్డల కోసం ఎంతో ఇష్టంతో విదేశాల నుంచి చాక్లెట్లు తీసుకువచ్చాడు. వాటిని చూసి.. ఆ బిడ్డల ఆనందం అంతా ఇంతా కాదు.. అయితే.. ఆ చాక్లెట్లను ఓ బాలుడు వాటిని తీసికెళ్లి స్కూల్లో దిందామనుకున్నాడు.. కానీ.. ఆ చాక్లెట్లే బాలుడి (8) కి శాపంగా మారాయి. చాక్లెట్ తింటున్న క్రమంలో గొంతులో అడ్డం పడి.. ఊపిరాడక బాలుడు విగతజీవిగా మారాడు. ఊపిరాడక కన్నుమూశాడు. ఈ విషాద ఘటన వరంగల్ పట్టణంలోని పిన్నవారి వీధిలో చోటుచేసుకుంది. రాజస్థాన్‌కు చెందిన కన్‌గహాన్‌సింగ్‌ 20 ఏళ్ల క్రితం వరంగల్‌కు వలస వచ్చాడు. జేపీఎన్‌ రోడ్‌లో ఎలక్ట్రికల్‌ దుకాణం నిర్వహిస్తున్నాడు. భార్య గీత, ముగ్గురు కుమారులు, కుమార్తెతో కలిసి పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు లైన్‌లో నివాసం ఉంటున్నాడు. వ్యాపార పనుల్లో భాగంగా కన్‌గహాన్‌ ఇటీవల ఆస్ట్రేలియా వెళ్లాడు. వస్తూవస్తూ పిల్లల కోసం అక్కడి నుంచి చాక్లెట్లు తెచ్చాడు.

కన్‌గహాన్‌ రెండో కుమారుడు ఎనిమిదేళ్ల సందీప్‌ వరంగల్‌ పిన్నావారి వీధిలోని శారదా పబ్లిక్‌ స్కూల్‌లో రెండో తరగతి చదువుతున్నాడు. ఇతడి అన్న, సోదరి కూడా ఇదే స్కూల్‌ విద్యార్థులు. కన్‌గహాన్‌సింగ్‌ పిల్లలను బైక్‌పై స్కూల్‌కి తీసుకెళ్లేముందు తల్లి వాళ్లకు చాక్లెట్లు ఇచ్చింది. వాటిని తింటూనే పిల్లలు బైక్‌ ఎక్కారు. నోట్లో చాక్లెట్‌తో సందీప్‌ పాఠశాల మొదటి అంతస్తులోని క్లాస్‌ రూంకి వెళ్లాడు. కాసేపటికే స్పృహ తప్పి పడిపోయాడు.

పాఠశాల యాజమాన్యం సమాచారం అందించడంతో కన్‌గహాన్‌సింగ్‌ హుటాహుటిన వచ్చి ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లాడు. సందీప్‌ గొంతులో చాక్లెట్‌ ఇరుక్కున్నట్లు వైద్యులు గుర్తించారు. చికిత్స అందిస్తుండగానే ఊపిరాడక చనిపోయాడు. శనివారం సాయంత్రం సందీప్‌ అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటనతో బాలుడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..