Hyderabad: వామ్మో గుడ్డు రేటు ఏంది ఇంత పెరిగింది…?

హైద‌రాబాద్ నగరంలో కోడిగుడ్ల ధరలు భారీగా పెరిగాయి. సరఫరా కొరతతో గత వేసవితో పోలిస్తే ధరలు భారీగా పెరిగాయి. గత ఐదు రోజులుగా ఒక్క గుడ్డు ధర మే నెలలో రోజురోజుకు పెరుగుతూ వస్తుంది. గుడ్లను ఇంటికి డెలివరీ చేయాలనుకుంటే డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లలో ఆరు యూనిట్ల ధర దాదాపు రూ. 70 ఉన్నాయి.

Hyderabad: వామ్మో గుడ్డు రేటు ఏంది ఇంత పెరిగింది...?
Eggs
Follow us

|

Updated on: May 06, 2024 | 12:52 PM

కోడిగుడ్డు ధర కొండెక్కి కూర్చుంది. సరఫరాలో కొరత కారణంగా కోడి గుడ్ల ధర పెరిగింది. గత వేసవితో పోలిస్తే నగరంలో గుడ్ల ధర గణనీయంగా పెరిగింది.  100 గుడ్ల ధర గతేడాది మే 4న రూ.420 ఉండగా, ఈ ఏడాది రూ.445కి పెరిగింది. ఉష్ణోగ్రతలు పెరిగిన కారణంగా కోళ్లు మరణించాయని.. అందుకే గుడ్డు ధర పెరిగిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గత నెల రోజులుగా గుడ్డు ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. గత నెలకు, ఈ నెలకు గుడ్డు ధర 70 పైసలు పెరిగింది. ఉదాహరణకు, ఏప్రిల్ 5న రూ.4.35 ఉన్న గుడ్డు ఇప్పుడు మే 5 నాటికి రూ.5.25కు చేరింది. బయట రిటైల్ షాపుల్లో గుడ్డును 6 నుంచి 7 రూపాయల వరకు అమ్ముతున్నారు. ఏది ఏమైనప్పటికీ, గత ఐదు రోజులలో మే ఎంటరయ్యక గుడ్డు ధర పెరుగుదల పీక్‌కి చేరింది.

ఒక్కసారిగా గుడ్డు ధర పెరగడంతో..  కొందామని షాపుకు వెళ్లిన మధ్యతరగతి వారు ధర చూసి నోరెళ్లబెడుతున్నారు. రోజుకో గుడ్డు తినే అలవాటు ఉన్నవారు.. ఇకపై వారంలో రెండు రోజులకోసారి తినాల్సిన పరిస్థితి వచ్చింది అంటున్నారు. రోగ నిరోధక శక్తి పెరుగుతుందని కరోనా సమయం నుంచి.. జనాలు కూడా గుడ్డును తిండిలో భాగం చేశారు. ఇప్పుడు అది లేకపోతే ఏదో వెలితిగా ఉంది అంటున్నారు.  మరోవైపు కోడిగుడ్ల రేట్లు పెరగడంతో వ్యాపారం సరిగ్గా జరగడం లేదని వ్యాపారస్తులు వాపోతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

Latest Articles
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం