MLA Rohit Reddy: ముగిసిన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఈడీ విచారణ.. ఆరు గంటల పాటు ఏ ప్రశ్నలు అడిగారంటే..

ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఈడీ విచారణ ముగిసింది. ఆరు గంటల పాటు ప్రశ్నించిన అధికారులు.. కుటుంబసభ్యులు, వ్యాపారాలకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. మంగళవారం మరోసారి రోహిత్‌ను విచారణకు పిలిచారు.

MLA Rohit Reddy: ముగిసిన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఈడీ విచారణ.. ఆరు గంటల పాటు ఏ ప్రశ్నలు అడిగారంటే..
Rohith Reddy
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 19, 2022 | 10:10 PM

విఙ్ఞప్తులు.. తిరస్కరణ మధ్య ఈడీ తన పంతాన్ని నెగ్గించుకుంది. ఎలాంటి వాయిదా లేకుండా రావాల్సిందేనన్న ఈడీ ఆదేశాలను గౌరవించారు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌ రెడ్డి. మధ్యాహ్నం 3.21 నిమిషాలకు బషీర్‌బాగ్‌లోని ఈడీ ఆఫీస్‌కు వెళ్లారు. దాదాపు ఆరు గంటల పాటు విచారణ కొనసాగింది. ఈనెల 16న ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులిచ్చింది. 19న హాజరుకావాలని సూచించింది. వచ్చే ముందు ఆధార్‌, ఓటర్ ఐడీతో ఇతర డాక్యుమెంట్లతో రావాలని సూచించిందన్నారు రోహిత్ రెడ్డి. న్యాయనిపుణులతో చర్చించి.. వాళ్ల అభిప్రాయాలు తీసుకుని హాజరవుతానని ప్రకటించారాయన. అయితే ఇవాళ ఉదయం 9.40 ని.లకు మణికొండలోని తన నివాసం నుంచి ఈడీ ఆఫీస్‌కు బయలుదేరిన రోహిత్‌ సడెన్‌గా ప్రగతి భవన్‌ వెళ్లారు. ఆ తర్వాత ఈనెల 31న హాజరవుతానని తన పీఏతో ఈడీకి లేఖ పంపించారు. విఙ్ఞప్తిని అధికారులు తిరస్కరించడంతో ఈడీ ఎదుట హాజరయ్యారు రోహిత్‌.

విచారణ అనంతరం బయటికొచ్చిన రోహిత్‌.. బయోడేటాకు సంబంధించిన వివరాలను మాత్రమే అధికారులు అడిగారన్నారు. విచారణకు రేపు మళ్లీ అధికారులు పిలిచారని అన్నారు రోహిత్‌.

మనీలాండరింగ్‌, మానిక్‌చంద్‌ కేసులకి సంబంధించి ఎలాంటి వివరాలు అడగలేదని క్లారిటీ ఇచ్చారు రోహిత్‌ రెడ్డి. అయితే రేపు ఈడీ అధికారులు ఎలాంటి ప్రశ్నలు సంధిస్తారు..? ఏ కేసుకి సంబంధించి ఏం సమాచారం అడుగుతారన్నది సస్పెన్స్‌గా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం