TSPSC Paper Leak Case: ఎంఎస్‌జే కోర్టులో ఈడీ పిటీషన్.. నిందితులను మరోసారి కస్టడీకి అప్పగించాలంటూ..

TSPSC Paper Leak Case: టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీ కేసులో నిందితులను మరోసారి తమ కస్టడీకి అప్పగించాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఎంఎస్‌జే కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. రేణుక రాఠోడ్, రాజేశ్వర్‌, ఢాక్యా నాయక్, గోపాల్, నీలేష్‌.. ఈ ఐదుగురిని కస్టడీకి ఇవ్వాలంటూ

TSPSC Paper Leak Case: ఎంఎస్‌జే కోర్టులో ఈడీ పిటీషన్.. నిందితులను మరోసారి కస్టడీకి అప్పగించాలంటూ..
Tspsc Paper Leak Case Update

Updated on: May 12, 2023 | 3:36 PM

TSPSC Paper Leak Case: టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీ కేసులో నిందితులను మరోసారి తమ కస్టడీకి అప్పగించాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఎంఎస్‌జే కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. రేణుక రాఠోడ్, రాజేశ్వర్‌, ఢాక్యా నాయక్, గోపాల్, నీలేష్‌.. ఈ ఐదుగురిని కస్టడీకి ఇవ్వాలంటూ న్యాయస్థానాన్ని ఈడీ కోరింది. ఈ మేరకు వారికి కోర్టు నోటీసులు జారీ చేసింది. నిందితుల తరఫు న్యాయవాదులు కౌంటర్‌ దాఖలు చేయనున్నారు. నిందితుల తరఫు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయనున్నారు. ఇక టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ కేసులో నిందితురాలు రేణుకతో పాటు మరొకరు జైలు నుంచి బుధవారం విడుదలైన విషయం తెలిసిందే.

అయితే ఇదే విషయంలో ఇటీవల నాంపల్లి కోర్టులో ఈడీకి చుక్కెదురైందని కూడా తెలిసిందే. నిందితులను కస్టడీకి ఇవ్వాలంటూ ఈడీ అధికారులు పిటిషన్‌ వేయగా.. దీనికి సిట్‌ అధికారులు కౌంటర్‌ పిటీషన్ దాఖలు చేశారు. ఇరువైపులా వాదనలు విన్న నాంపల్లి 12వ అదనపు మెజిస్ట్రేట్‌ న్యాయస్థానం.. ఈడీ అధికారులు వేసిన పిటిషన్‌‌ను కొట్టివేసింది. దీంతో ఈడీ ప్రస్తుత పిటీషన్ కోసం ఎంఎస్‌జే కోర్టును ఆశ్రయించింది.

కాగా, బుధవారం  రేణుక రాథోడ్‌కు బెయిల్ లభించిన నేపథ్యంలో ఏ-1 ప్రవీణ్ కుమార్‌, ఏ-2 రాజశేఖర్, ఏ-4 డాక్యా నాయక్, ఏ-5 రాజేశ్వర్‌ నాయక్ తాజాగా నాంపల్లి న్యాయస్థానంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us