సింగరేణిలో భూకంప భయం..! బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న కార్మికులు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..

| Edited By: Jyothi Gadda

Dec 05, 2024 | 4:19 PM

సింగరేణి లో భూకంప భయం పట్టుకుంది.. ఎప్పుడు ప్రకంపలు వస్తాయోనని ఆందోళన చెందుతున్నారు..అయితే..ఇక్కడ అధిక ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బొగ్గు తీసిన సమయంలో సరిగా ఫిల్లింగ్ చేయడం లేదని ఆరోపణలు ఉన్నాయి..పూర్తి వివరాల్లోకి వెళితే...

సింగరేణిలో భూకంప భయం..! బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న కార్మికులు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..
Earthquake
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో సంభవించిన భూకంపంపై ఉత్తర తెలంగాణలోని కోల్ బెల్ట్ ప్రాంతంలో విస్తృత చర్చ జరుగుతోంది. సింగరేణి సంస్థ విస్తరించి ఉన్న ములుగు ప్రాంతంలో భూకంపం సంభవించినట్లు నిర్ధారణ కావడంతో కోల్ బెల్ట్ ప్రాంత ప్రజలు, ప్రధానంగా సింగరేణి కార్మిక కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురికావాల్సి వస్తోంది. ప్రకృతికి విరుద్ధంగా భూగర్భంలో పనిచేసే కార్మికులకు భూకంపాల వల్ల ప్రమాదం పొంచి ఉందా అనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే భూమి గర్భంలోని బొగ్గును వెలికి తీసిన ప్రాంతంలో ఇసుక గాని, బూడిద గాని నింపడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండబోదని పలువురు సూచిస్తున్నారు.

గతంలో ఖాళీ గులాయిల్లో స్టోయింగ్ చేయకపోవడం మూలంగా భూగర్భ గనుల్లో ప్రమాదాలు సంభవించి అనేకమంది కార్మికులు ప్రాణాలు విడిచిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్టోయింగ్ పట్ల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భారీ ప్రమాదం తప్పదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. భూకంపం కొన్ని సెకన్ల పాటు వచ్చిన కాళీ గులాయిలు కూలిపోతే భారీగా ప్రాణ నష్టం కూడా సంభవించే అవకాశాలున్నట్లు పలువురు భావిస్తున్నారు. ఈ క్రమంలో బొగ్గును వెలికి తీసిన ప్రాంతంలో స్టోయింగ్ చేయడంపై యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించాలని కార్మిక సంఘాల నాయకులు సూచిస్తున్నారు.

సింగరేణి సరైన జాగ్రత్త లు తీసుకోవడం లేదని కార్మిక సంఘ నేతలు చెబుతున్నారు. భూ గర్భ గనుల్లో బొగ్గు తీసిన తరువాత..ఫిల్లింగ్ చేయడం లేదని అంటున్నారు. కొద్దీ తీవ్రతతో భూ కంపం వచ్చినా కూడా ఇక్కడ అధిక ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. సింగరేణి లో భూ ప్రకంప లు అధికంగా వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ భూమి గట్టిగా ఉండదని అంటున్నారు..దీంతో చిన్న ప్రకంపనాలకే.. ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..