తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన నారాయణపేట జిల్లా మహిళా సాధికారత కేంద్రం.. ఒప్పంద ప్రాతిపదికన డిస్ట్రిక్ట్ మెషిన్ కో-ఆర్డినేటర్, జెండర్ స్పెషలిస్ట్, ఫైనాన్షియల్ లిటరసీ స్పెషలిస్ట్, అకౌంట్ అసిస్టెంట్, మల్టీ పర్పస్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి పోస్టును బట్టి పదో తరగతి, గ్రాడ్యుయేట్ సోషల్ సైన్స్/లైఫ్ సైన్స్/న్యూట్రిషన్/మెడిసిన్ హెల్త్/సోషల్ వర్క్/రూరల్ మేనేజ్‌మెంట్/అకౌంట్స్/బ్యాంకింగ్‌లో డిగ్రీ, పీజీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
ఈ అర్హతలున్న వారు ఆఫ్‌లైన్ విధానంలో ఏప్రిల్ 6, 2023వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు కింది అడ్రస్‌లో దరఖాస్తులు సమర్పించవల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.15,600ల నుంచి రూ.38,500ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
జిల్లా సంక్షేమ కార్యాలయం, మోనప్పగుట్ట, నారాయణపేట-509210, తెలంగాణ.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.