AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wine Shops: శ్రీరామనవమి రోజు తెలంగాణ వ్యాప్తంగా వైన్ షాపులు బంద్ ఉంటాయా..?

బ్లాక్ మార్కెట్‌లో కూడా లిక్కర్ విక్రయాలు జరిపితే కేసులు నమోదు చేస్తామని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. తాము ఎక్కడికక్కడ పరిస్థితిని నిశితంగా పరీశీలిస్తామని వెల్లడించారు.

Wine Shops: శ్రీరామనవమి రోజు తెలంగాణ వ్యాప్తంగా వైన్ షాపులు బంద్ ఉంటాయా..?
Wine Shops Closed
Ram Naramaneni
|

Updated on: Mar 29, 2023 | 3:00 PM

Share

గురువారం శ్రీరామనవమి సందర్భంగా పలు ప్రాంతాల్లో శోభాయాత్ర జరుగుతుంది. ఈ క్రమంలోనే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరకుండా నగరంలో పోలీసుల పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. సెన్సిటివ్ ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. ముందస్తు చర్యల్లో భాగంగా పండుగ రోజు హైదరాబాద్‌లో వైన్ షాపులు, బార్లు, పబ్స్ మూతపడనున్నాయి. 30వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 31వ తేదీ నుంచి ఉదయం 6 గంటల వరకు అన్ని లిక్కర్ షాప్స్, బార్స్ బంద్ కానున్నాయి.  ఫైవ్‌స్టార్ హోటళ్లలోని బార్ రూమ్‌లను కూడా క్లోజ్ అవుతాయి.

ఎవరైనా రూల్స్ అతిక్రమిస్తే.. కఠిన చర్యలు ఉంటాయని హైదారాబాద్ పోలీసులు హెచ్చరించారు. బ్లాక్‌లో మందు అమ్మితే.. చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇక్కడ చాలామంది మందుబాబులకు ఓ డౌట్ ఉంది. కేవలం హైదరాబాద్‌లో మాత్రమే వైన్ షాప్స్ క్లోజ్ అవుతాయా లేదా రాష్ట్రవ్యాప్తంగా క్లోజ్ అవుతాయని అన్నది వారి నాలుకను వేధిస్తున్న ప్రశ్న. అధికారులు విడుదల చేసిన ఆదేశాల ప్రకారం.. హైదరాబాద్, సికింద్రాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో మాత్రమే షాపులు క్లోజ్ అవ్వనున్నాయి. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో షాపులు ఓపెన్ అయ్యే ఉంటాయి.

అయితే  శ్రీరాముడు ఆదర్శమూర్తి. ఏకపత్నీవ్రతుడు, సుగుణావంతుడు.. అమ్మనాన్నల మాటను జవదాటనివాడు. నిత్యం నిజం పలికే దివ్యమూర్తి. ఆ మహనీయుని జన్మ దినం రోజున, సీతాదేవితో ఆయన కళ్యాణం జరిగే రోజున మద్యం ముట్టడం ఎందుకు చెప్పండి. అందులోనూ మద్యం ఆరోగ్యానికి హానికరం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.