Telangana: అమ్మవారి మండపం వద్ద అవేర్నెస్ ప్రోగ్రామ్.. ఆదర్శంగా నిలిస్తున్న యువత

| Edited By: Balaraju Goud

Oct 06, 2024 | 9:26 PM

ఆధ్యాత్మిక పరవశంతోపాటు సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాలు, మత్తు పదార్థాలను ఎలా నివారించాలని ప్రజలను చైతన్య పరచడంలో కేరాఫ్ అడ్రస్‌గా మారింది యువ కిరణం స్పోర్ట్స్ అసోసియేషన్.

Telangana: అమ్మవారి మండపం వద్ద అవేర్నెస్ ప్రోగ్రామ్.. ఆదర్శంగా నిలిస్తున్న యువత
Variety Mandapam
Follow us on

ఆధ్యాత్మిక పరవశంతోపాటు సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాలు, మత్తు పదార్థాలను ఎలా నివారించాలని ప్రజలను చైతన్య పరచడంలో కేరాఫ్ అడ్రస్‌గా మారింది యువ కిరణం స్పోర్ట్స్ అసోసియేషన్. అందరిలా కాకుండా భిన్నంగా ఆలోచిస్తూ ప్రజల మేలు కొలుపే విధంగా మత్తు పదార్థాలతో ఎలా జాగ్రత్తగా నివారించాలి.. డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టడంతో పాటు, డ్రగ్స్ అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన మండపం వద్ద అష్టాదశ పీఠాలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి శభాష్ అనిపించుకుంటున్నారు.

కొందరు యూత్ సభ్యులు సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో యువ కిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నవరాత్ర ఉత్సవాలతోపాటు జనానికి మంచి సందేశం ఇస్తున్నారు. ఇందులో భాగంగా వినాయక విగ్రహ ప్రతిష్ట ఉత్సవ కావచ్చు. దేవి నవరాత్రి ఉత్సవాలు కాని ఘనంగా నిర్వహిస్తున్నారు. తాజాగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. నేటి యువతలో డ్రగ్స్ అనర్ధాలపై చైతన్యం తీసుకురావడంతో పాటు భక్తి భావాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో వినూత్న ఆలోచనకు ముందు అడుగు వేశారు.

అమ్మవారి మండపం వద్ద యువత మేలుకో డ్రగ్స్ మహమ్మారిని తరిమికొడదాం అంటూ మండపానికి వినూత్నంగా అష్టాదశ పీఠాల మాదిరిగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. మత్తుకు బానిసై నేటి యువత జీవితాలు చిత్తు చేసుకుంటున్నారనే ఉద్దేశంతో, వినూత్న ఆలోచించి డ్రగ్స్ పై అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటుగా, డ్రగ్స్ నిర్మూలన పై అవగాహన కల్పిస్తున్నారు. అమ్మవారి దయతో రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్ మహమ్మారి యువత నుండి దూరం కావాలని స్పోర్ట్స్ అసోసియేషన్ కోరుతున్నారు.

సామాజిక కార్యక్రమాల్లో ముందుంటున్న యువ కిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ భక్తులు, ప్రజలు, అధికారులతో పాటు పోలీసుల మన్ననలు పొందుతున్నారు. అందరిలా కాకుండా భిన్నంగా ఆలోచిస్తూ ఏర్పాటు చేసిన అమ్మవారి వద్దకు తల్లిదండ్రులే వారి పిల్లలను తీసుకొని పెద్ద సంఖ్యలో తరలి రావడం విశేషం.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..