MPHAF Exam Date: మల్టీపర్పస్ హెల్త్ వర్కర్-ఫిమేల్ ఉద్యోగాల నియామక పరీక్ష ఎప్పటికి జరిగేనో..? ఇంకా వెలువడని పరీక్ష తేదీ
తెలంగాణ వైద్యారోగ్య శాఖలో 1931 పోస్టుల భర్తీకి 2023 జులైలో నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. అదే ఏడాది నవంబరు 10న పరీక్ష కూడా జరగాల్సి ఉంది. ఏడాది కావస్తున్నా తిరిగి పరీక్ష నిర్వహించే తేదీ వెల్లడించడం లేదు. మొదట ఈ పోస్టులు 1,536 ఉండగా, ఆ తర్వాత వాటిని 1,931కి పెరిగాయి. ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ పరిధిలో 1,666, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో..
హైదరాబాద్, అక్టోబర్ 7: తెలంగాణ వైద్యారోగ్య శాఖలో 1931 పోస్టుల భర్తీకి 2023 జులైలో నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. అదే ఏడాది నవంబరు 10న పరీక్ష కూడా జరగాల్సి ఉంది. ఏడాది కావస్తున్నా తిరిగి పరీక్ష నిర్వహించే తేదీ వెల్లడించడం లేదు. మొదట ఈ పోస్టులు 1,536 ఉండగా, ఆ తర్వాత వాటిని 1,931కి పెరిగాయి. ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ పరిధిలో 1,666, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో 265 పోస్టులను భర్తీ చేయనున్నట్లు అప్పట్లో తెలిపారు. వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) వైద్య, ఆరోగ్యశాఖలో మల్టీపర్పస్ హెల్త్ వర్కర్-ఫిమేల్ (ఎంపీహెచ్‌ఏ-ఎఫ్) ఉద్యోగాల కోసం నిర్వహించవల్సిన రాత పరీక్షను వాయిదా వేస్తున్నట్లు అక్టోబరు 21న వైద్య శాఖ ప్రకటించింది. దీంతో అప్పటి నుంచి దీని గురించి పట్టించుకున్న నాథుడే లేదు. నోటిఫికేషన్ రాగానే సంతోషించిన వేల మంది నిరుద్యోగులకు నిరాశే మిగిలింది. ఉద్యోగాలకు రఖాస్తు చేసుకుని ఏడాది కావస్తున్నా వారికి పరీక్ష రాసే భాగ్యం కలగడం లేదని వాపోతున్నారు. 2023 అక్టోబరులో వాయిదా వేసిన పరీక్షను ఇప్పటికీ నిర్వహించకపోవడంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడంతో అప్పటికే ఆ శాఖలో సేవలు అందిస్తున్న వారితోపాటు కొత్త వారూ భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. అర్హత పరీక్షలో సాధించిన మార్కులకు 70 పాయింట్లు, రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య సంస్థలు, కార్యక్రమాల్లో విధులు నిర్వహించే వారికి గరిష్ఠంగా 30 పాయింట్లు కేటాయించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. గరిష్ఠ వయోపరిమితిని 49 ఏళ్లుగా నిర్ణయించారు. దివ్యాంగులకు వయోపరిమితిలో పదేళ్ల మినహాయింపు ఇచ్చి 59 ఏళ్ల వారికీ అవకాశం కల్పించారు. వారికి పదవీ విరమణ వయసు 61 ఏళ్లు కావస్తున్నా పరీక్ష జాడ కానరావడం లేదు. ఇప్పటికైనా పరీక్ష తేదీ ప్రకటించాలని నిరుద్యోగులు కోరుతున్నారు.
తెలంగాణ వ్యవసాయ వర్సిటీ కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేసింది.. ఈ నెల 14 నుంచి రిజిస్ట్రేషన్లు
తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో 2024-25 విద్యా సంవత్సరానికి బైపీసీ విభాగంలో పలు కోర్సుల భర్తీకి సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ప్రక్రియలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మాత్రమే ఈ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. అక్టోబర్ 14 నుంచి 19వ తేదీ వరకు కౌన్సెలింగ్ కొనసాగుతుంది. బీఎస్సీ అగ్రికల్చర్ (ఆనర్స్), బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్ (ఆనర్స్), బీటెక్ పుడ్ టెక్నాలజీ, బీవీఎస్సీ అండ్ ఏహెచ్, బీఎఫ్‌ఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. టీజీ ఈఏపీసెట్ 2024లో వచ్చిన ర్యాంకు ఆధారంగా కౌన్సెలింగ్‌లో సీట్లు కేటాయిస్తారు. ర్యాంకు సాధించిన అభ్యర్థులు రాజేంద్రనగర్‌లోని పీజేటీఎస్‌ఏయూ యూనివర్సిటీ ఆడిటోరియంలో ఆయా తేదీల్లో ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
అగ్రికల్చర్ కౌన్సెలింగ్ షెడ్యూల్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.