Doctor Prabhu Kumar: కరోనా సమయంలో చేసిన వైద్య సేవలకు గుర్తింపు.. తెలంగాణ డాక్టర్‌కు నేషనల్ యంగ్ లీడర్ అవార్డు..

Doctor Prabhu Kumar: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ యాక్షన్ కమిటీ ఛైర్మన్, ప్రముఖ డా. ప్రభు కుమార్ చల్లగాలికి డాక్టర్ కేతన్ దేశాయ్ యంగ్ లీడర్..

Doctor Prabhu Kumar: కరోనా సమయంలో చేసిన వైద్య సేవలకు గుర్తింపు.. తెలంగాణ డాక్టర్‌కు నేషనల్ యంగ్ లీడర్ అవార్డు..
Dr. Prabhu Kumar Challagali

Edited By: Ram Naramaneni

Updated on: Nov 15, 2021 | 12:51 PM

Doctor Prabhu Kumar: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ యాక్షన్ కమిటీ ఛైర్మన్, ప్రముఖ డా. ప్రభు కుమార్ చల్లగాలికి డాక్టర్ కేతన్ దేశాయ్ యంగ్ లీడర్ అవార్డు వరించింది. యువ నాయకులుగా ప్రభు కుమార్ చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రకటించింది ఐఎంఏ. ఈ అవార్డు ప్రదానోత్సవం రేపు (14 నవంబర్ 2021న) సాయంత్రం 5.00 గంటలకు న్యూ ఢిల్లీలోని IMA హౌస్‌లో జరగనుంది. అనేక మంది ప్రభుత్వ పెద్దలు, జాతీయ నేతలు, వైద్య రంగ ప్రముఖులు, అధికారుల సమక్షంలో ఈ అవార్డుల వేడుక జరపనున్నారు నిర్వాహకులు. ఈ మేరకు ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ J.A. జయలాల్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జయేష్ లేలే ఒక ప్రకటనలో తెలిపారు.

హైదరాబాద్ లో నివాసముంటున్న డాక్టర్ ప్రభు కుమార్ కరోనా టైమ్ లో అత్యథిక మంది పేషెంట్లకు వైద్య సేవలందించిన విషయం విధితమే. అంతే కాదు ప్రజల్లో కరోనా పై అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. వారిని చైతన్యం చేసేందుకు ప్రసార మాధ్యమాల ద్వారా ఎన్నో ఆర్టికల్స్ రాశారు. అనేక మంది మన్ననలు, విమర్శకుల ప్రశంసలు పొందారు. బంజారాహిల్స్ ఐఎంఏ ప్రెసిడెంట్, రాపా మెడికల్ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్ డైరెక్టర్ గా ఉన్న ప్రభుకుమార్ ఇప్పటికే వైద్య రత్న, వైద్య విభూషణ్, వైద్య శిరోమణి, బెస్ట్ డాక్టర్ అవార్డు గ్రహీత, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ అవార్డులు పొంది ప్రజల్లో మంచి గుర్తింపు పొందారు.

Also Read:

 హిట్‌మ్యాన్ అరుదైన రికార్డు.. వన్డేలో ఎవ్వరికి సాధ్యం కాలే.. ఇప్పటికీ చెక్కు చెదరలే.. అదేంటో తెలుసా?

మాస్క్ చాటున దాగిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా ? బాలీవుడ్‏ను కుదిపేసిన ఈ ముద్దుగుమ్మ ఎవరు..

ఆన్‌లైన్ కేటుగాళ్ల ఉచ్చులో పడ్డ ఆర్బీఐ రిటైర్డ్ ఉద్యోగి.. ఎస్‌బీఐ అధికారినంటూ ఫోన్‌ చేసి..