Rohit Sharma: హిట్‌మ్యాన్ అరుదైన రికార్డు.. వన్డేలో ఎవ్వరికి సాధ్యం కాలే.. ఇప్పటికీ చెక్కు చెదరలే.. అదేంటో తెలుసా?

On This Day in 2014: రోహిత్ శర్మ వన్డేలలో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసి సరిగ్గా నేటికి ఏడు సంవత్సరాలు. ఈ మేరకు బీసీసీఐ ట్విట్టర్‌లో వీడియోను షేర్ చేసింది.

Rohit Sharma: హిట్‌మ్యాన్ అరుదైన రికార్డు.. వన్డేలో ఎవ్వరికి సాధ్యం కాలే.. ఇప్పటికీ  చెక్కు చెదరలే.. అదేంటో తెలుసా?
Rohit Sharma 264
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 13, 2021 | 2:35 PM

Rohit Sharma 264: భారత ఓపెనర్ రోహిత్ శర్మ 2014లో ఈ రోజున శ్రీలంకతో జరిగిన వన్డేలో 264 పరుగులు సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. నవంబర్ 13, 2014న వన్డే ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేశాడు. ఇప్పటికీ ఈ రికార్డు అజేయంగానే నిలిచింది. ఈ మేరకు బీసీసీఐ హిట్‌మ్యాన్ నాక్‌ను గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేసింది. ఏడేళ్ల క్రితం భారత ఓపెనర్ రోహిత్ శర్మ రికార్డు బద్దలు కొట్టి డబుల్ సెంచరీతో ఈడెన్ గార్డెన్స్‌లో వెలుగులు నింపాడు. ఇది ఇప్పటి వరకు పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఏ బ్యాటర్‌కు అందని రికార్డుగా నిలిచిపోయింది. ‘హిట్‌మ్యాన్’గా పేరుగాంచిన రోహిత్, వీరేంద్ర సెహ్వాగ్ చేసిన 219 పరుగులను అధిగమించి వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ 173 బంతుల్లో 33 ఫోర్లు, 9 అద్భుతమైన సిక్సర్లతో సూపర్ నాక్ ఆడాడు. వన్డే క్రికెట్‌లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక బ్యాటర్‌గా రోహిత్ పలు రికార్డులు సాధించాడు.

ఈ మ్యాచులో భారత్ 50 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 404 పరుగుల భారీ స్కోర్‌ను సాధిచింది. అనంతరం శ్రీలంక 251 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో నాలుగో వన్డేలో టీమిండియా అద్భుత విజయం సాధించింది. 2010లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 50 ఓవర్ల ఫార్మాట్‌లో డబుల్ సెంచరీ నమోదు చేసిన మొదటి బ్యాటర్‌గా సచిన్ టెండూల్కర్ నిలిచాడు. ఈ వారం ప్రారంభంలో, రోహిత్ భారత టీ20ఐ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. విరాట్ కోహ్లీ తరువాత టీ20ఐలో కెప్టెన్‌గా రోహిత్ శర్మ వ్యవహరించనున్నాడు.

న్యూజిలాండ్‌తో జరగబోయే సిరీస్‌కు రోహిత్ కెప్టెన్‌గా ఎంపిక కాగా, కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. రుతురాజ్ గైక్వాడ్, హర్షల్ పటేల్, వెంకటేష్ అయ్యర్, అవేష్ ఖాన్, అక్షర్ పటేల్ కూడా న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌కు జట్టులో చోటు దక్కించుకున్నారు. మొదట న్యూజిలాండ్‌తో టీ20ఐ సిరీస్‌ని ఆడుతుంది. ఆ తర్వాత రెండు టెస్ట్ మ్యాచ్‌ల్లో ఇరుజట్లు తలపడనున్నాయి. నవంబర్ 17న జైపూర్‌, 19న రాంచీ, నవంబర్ 21న కోల్‌కతాలో మూడు టీ20లు జరుగుతాయి. అనంతరం రెండు టెస్టులు కాన్పూర్ (నవంబర్ 25-29), ముంబై (డిసెంబర్ 3-7)లో జరుగుతాయి.

Also Read: కాబోయే అల్లుడిపై మామ ఫైర్.. తెలివిగా బౌల్ చేయడంలో విఫలం.. ఆ మూడు సిక్సులే పాక్ ఓటమికి కారణమంటూ విమర్శలు..!

T20 World Cup Final: టెస్టు, వన్డేల్లో అగ్రస్థానం.. మరి టీ20ల్లోనూ కివీస్‌కు సాధ్యమయ్యేనా.. టీ20 ప్రపంచకప్‌ గెలిస్తే ఏం జరగనుందో తెలుసా?

Latest Articles
జంగిల్‌ సఫారిలో షాకింగ్‌ సీన్.!పర్యాటకుల ముందుకొచ్చిన ముసలి సింహం
జంగిల్‌ సఫారిలో షాకింగ్‌ సీన్.!పర్యాటకుల ముందుకొచ్చిన ముసలి సింహం
లాస్ట్‌ పంచ్‌.. ఫినిషింగ్ టచ్.. పిఠాపురంలో సీఎం జగన్.. లైవ్..
లాస్ట్‌ పంచ్‌.. ఫినిషింగ్ టచ్.. పిఠాపురంలో సీఎం జగన్.. లైవ్..
యష్ తో సినిమాకు నయనతార భారీ రెమ్యునరేషన్ డిమాండ్.. 
యష్ తో సినిమాకు నయనతార భారీ రెమ్యునరేషన్ డిమాండ్.. 
చేపలు పడుతుండగా కనిపించిన నల్లటి ఆకారం.. ఒడ్డుకు దూసుకొచ్చింది.!
చేపలు పడుతుండగా కనిపించిన నల్లటి ఆకారం.. ఒడ్డుకు దూసుకొచ్చింది.!
సీపీ పేరుతో ఆఫర్ లెటర్.. కట్ చేస్తే..!
సీపీ పేరుతో ఆఫర్ లెటర్.. కట్ చేస్తే..!
నటి దారుణ హత్య.. కుళ్లిన స్థితిలో మృతదేహాలు..
నటి దారుణ హత్య.. కుళ్లిన స్థితిలో మృతదేహాలు..
ఈ వయ్యారి హత్తుకొనేదే అందానికి విలువ లేదేమో.. మెస్మేరైజ్ ఫొటోస్..
ఈ వయ్యారి హత్తుకొనేదే అందానికి విలువ లేదేమో.. మెస్మేరైజ్ ఫొటోస్..
మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆరోపణలపై టీఎస్ ఆర్టీసీ రియాక్షన్..
మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆరోపణలపై టీఎస్ ఆర్టీసీ రియాక్షన్..
బంగారు అభరణాలపై హాల్‌మార్క్ సిస్టమ్ ఎలా పని చేస్తుంది?
బంగారు అభరణాలపై హాల్‌మార్క్ సిస్టమ్ ఎలా పని చేస్తుంది?
అందంతో హంస జతకడితే ఈ వయ్యారి రూపం.. సిజ్లింగ్ లుక్స్ వైరల్..
అందంతో హంస జతకడితే ఈ వయ్యారి రూపం.. సిజ్లింగ్ లుక్స్ వైరల్..