Hyderabad: అమ్మనాన్నలు నీ మంచి కోసమే చెప్పారు కద చిన్నా…
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ సయ్యద్‌నగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. మొబైల్‌లో గేమ్స్ ఆడవద్దని తండ్రి మందలించడంతో ఐదో తరగతి విద్యార్థి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిన్న వయసులోనే తల్లిని కోల్పోయిన బాలుడు మారు తల్లి వద్ద పెరుగుతున్నాడు. స్కూల్‌కు వెళ్లకుండా పదేపదే ఫోన్‌లో గేమ్స్ ఆడుతున్నాడని తండ్రి హెచ్చరించినట్లు సమాచారం.

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పరిధిలోని సయ్యద్‌నగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. మొబైల్‌లో గేమ్స్ ఆడవద్దని తండ్రి మందలించడంతో ఐదో తరగతి చదువుతున్న బాలుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, బాలుడు చిన్న వయసులోనే తల్లిని కోల్పోయాడు. అనంతరం తండ్రి ఇర్ఫాన్ ఖాన్ మళ్లీ వివాహం చేసుకోవడంతో బాలుడు మారు తల్లి వద్ద పెరుగుతున్నాడు. ఇటీవల కాలంలో స్కూల్‌కు వెళ్లకుండా మొబైల్ ఫోన్‌లో ఎక్కువ సమయం గడుపుతూ గేమ్స్ ఆడుతున్నాడని కుటుంబ సభ్యులు గమనించారు. పలుమార్లు హెచ్చరించినప్పటికీ బాలుడు అలవాటు మార్చుకోకపోవడంతో తండ్రి మందలించినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలుడు ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలుడి మృతితో కుటుంబంలో విషాద వాతావరణం నెలకొంది. చిన్నారులపై మొబైల్ వినియోగం, ఆన్‌లైన్ గేమ్స్ ప్రభావంపై మళ్లీ చర్చ మొదలైంది.
