ఒరిజినల్‌గా బయటకొస్తే ఇలా ఉంటాది..

ప్రజా ప్రతినిధులు అప్పుడప్పుడు తమలోని కళా పోషణను బయటకు తీస్తూంటారు. ఒక్కోసారి ఒరిజినల్‌గా బయటకు వస్తే.. కొన్ని సందర్భాల్లో అందరితో కలిసిపోతూ తమలోని ఎక్ట్ర్సా పెర్ఫార్మెన్స్‌ను చాటుకుంటారు. ఎక్కడున్నా ప్రజల దృష్టిని తమవైపు తిప్పకునేందుకు ఆకట్టుకుంటారు. వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ తన కళా పోషణను ఇలా చాటుకున్నారు. దారూర్ మండలం కేరెల్లి గ్రామంలో జరిగిన వీరబ్రహ్మేంద్ర స్వామి నాటకంలో తన పాత్రను పోషించారు. కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చిన ఎమ్మెల్యే తనలోని కళను ఇలా బయటకు […]

ఒరిజినల్‌గా బయటకొస్తే ఇలా ఉంటాది..

ప్రజా ప్రతినిధులు అప్పుడప్పుడు తమలోని కళా పోషణను బయటకు తీస్తూంటారు. ఒక్కోసారి ఒరిజినల్‌గా బయటకు వస్తే.. కొన్ని సందర్భాల్లో అందరితో కలిసిపోతూ తమలోని ఎక్ట్ర్సా పెర్ఫార్మెన్స్‌ను చాటుకుంటారు. ఎక్కడున్నా ప్రజల దృష్టిని తమవైపు తిప్పకునేందుకు ఆకట్టుకుంటారు.

వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ తన కళా పోషణను ఇలా చాటుకున్నారు. దారూర్ మండలం కేరెల్లి గ్రామంలో జరిగిన వీరబ్రహ్మేంద్ర స్వామి నాటకంలో తన పాత్రను పోషించారు. కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చిన ఎమ్మెల్యే తనలోని కళను ఇలా బయటకు తీశారు. తోటి కళాకరుల పాటలకు ఇలా డోల్ వాయిస్తూ ఉత్తేజపరిచారు. గ్రామంలో జరిగిన వీధినాటకంలో తన వంతు సహకారాన్ని అందించారు.