CM KCR: కేంద్రం పాపాల చిట్టా దొరికిందా? చర్చనీయాంశంగా గులాబీ బాస్ రాజకీయం.. మళ్లీ ఢిల్లీ వేదికగా..
CM KCR on Central government: బీజేపీ ప్రభుత్వ పాపాల పుట్ట బయటపెడతా.. ఢిల్లీ గడ్డపై ఆధారాలను ప్రజల ముందుపెడతా అంటూ ఘాటుగా విమర్శలు చేస్తున్న సీఎం కేసీఆర్.. నిజంగానే కేంద్రం అవినీతిపై ఎవిడెన్స్ సేకరించారా?
CM KCR on Central government: బీజేపీ ప్రభుత్వ పాపాల పుట్ట బయటపెడతా.. ఢిల్లీ గడ్డపై ఆధారాలను ప్రజల ముందుపెడతా అంటూ ఘాటుగా విమర్శలు చేస్తున్న సీఎం కేసీఆర్.. నిజంగానే కేంద్రం అవినీతిపై ఎవిడెన్స్ సేకరించారా? కేసీఆర్‌కు ఈ ఆధారాలు అందించింది ఎవరు..? అనేది చర్చనీయాంశంగా మారింది. రాఫెల్స్ కుంభకోణం నుంచి బ్యాంకులో నుంచి లండన్ పారిపోయిన బడా పారిశ్రామికవేత్తల వరకు అన్నింటి వెనకా బీజేపీ నేతల హస్తం ఉందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు సీఎం కేసీఆర్. బీజేపీ మంత్రుల స్కాములు స్కీములు బయట పెడతానంటూ గత కొద్ది కాలంగా చెబుతూ వస్తున్నారు. లండన్లో దాక్కున్న విజయ్ మాల్యా, నీరవ్ మోడీ లాంటి వ్యక్తులను అరెస్టు చేయడానికి వెళ్లిన అధికారులను బీజేపీ నేతలు వెనక్కి రావాలని ఆదేశించారని బాంబు పేల్చారు. ఇది జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసింది. వీటన్నింటికీ సాక్ష్యాలు ఉన్నాయి అంటూ జాతీయ పార్టీల నేతలు కూడా చర్చించుకున్నారు. ఢిల్లీ గడ్డపై బీజీపీ అవినీతిని సాక్షాలతో ప్రజల ముందు ఉంచుతాం అంటూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు బహిరంగంగానే ప్రకటించారు.
జాతీయ రాజకీయాలపై పూర్తిస్థాయి దృష్టి పెట్టిన కేసీఆర్ నిజంగానే కేంద్ర ప్రభుత్వ అవినీతిపై ఆధారాలు సేకరిస్తున్నారా అనే చర్చ మొదలైంది. లేదా ఇంకెవరైనా కేసీఆర్‌కు ఈ ఆధారాలను అందిస్తున్నారా? కేసీఆర్ గత కొద్దికాలంగా ఏది మాట్లాడుతున్నా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ చూపిస్తున్నారు. హంగర్ ఇండెక్స్‌లో భారతదేశం ఏ స్థానంలో ఉంది. చైనాతో భారత్ ను పోల్చుతూ మన వృద్ధి ఏ స్థాయిలో ఉంది. ఇలా అంతర్జాతీయ నివేదికలు తెప్పించుకొని మరీ చూపిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ టీం కేసీఆర్‌కు ఈ సమాచారం అందిస్తుంది అనేది ప్రతిపక్షాల అనుమానం.
కేసీఆర్ నెట్‌వర్క్..
కానీ, కేసీఆర్ మాత్రం తెలంగాణ ఉద్యమ కాలం నుంచే ఢిల్లీలో తనకంటూ ప్రత్యేక సోర్స్ ఏర్పాటు చేసుకున్నారు. కాంగ్రెస్ అంతర్గత విషయాలు, తెలంగాణపై వార్ రూమ్‌లో జరుగుతున్న చర్చలను కూడా ఆయన పసిగట్టేవారు. కేంద్ర మంత్రిగా పని చేసిన కేసీఆర్‌కు ఢిల్లీ అధికారులతో మంచి గ్రిప్ ఉంది. తెలంగాణ ఎప్పుడు వస్తుంది బిల్లును ఎప్పుడు ప్రవేశ పెడుతున్నారు దగ్గర్నుంచి.. కరోనా సమయంలో లాక్ డౌన్ పెట్టే విషయం వరకు అన్నింటినీ ముందే కేసీఆర్ బయటపెట్టారు. దీనికితోడు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో కొంత చురుగ్గా వ్యవహరిస్తున్న కేసీఆర్కు ఆయా నేతల నుంచి కూడా ఉప్పు అవుతుందనేది సమాచారం.
మొత్తంగా ఇదేమీ రాజకీయ విమర్శలు కనిపించడంలేదు. మరోవైపు కేసీఆర్ చేసిన ఈ తీవ్ర విమర్శలు పట్ల బీజేపీ నేతలు కూడా ఎందుకో పెద్దగా స్పందించలేదు. కేసీఆర్ సమయం చూసుకొని ఆధారాలు బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని ఇది గులాబీ నేతల అభిప్రాయం. అయితే మాటల మాంత్రికుడు కేసీఆర్ దగ్గర నిజంగానే ఆధారాలు ఉన్నాయా? లేదా బీజేపీతో మైండ్ గేమ్ ఆడుతున్నారా అనేది కూడా రాజకీయాల్లో ఆసక్తిని కలిగిస్తోంది.
Also Read: