Hyderabad: హైదరాబాద్‌తో అంబేద్కర్‌కు ప్రత్యేక అనుబంధం.. అదేంటో తెలుసా..!

ఎందరో మహానుభావులు..! కానీ రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్‌ అంబేద్కర్‌కు తెలంగాణతో ఉన్న బంధం ప్రగాఢమైనది. హైదరాబాద్‌తో ఆయన అనుబంధం ప్రత్యేకమైనది! అందుకేకాబోలు..సీఎం కేసీఆర్‌ ఈ మహా సంకల్పం చేశారు. పీడిత జన బాంధవుడైన అంబేద్కర్‌ను.. 125 అడుగుల మహా విగ్రహరూపంలో ప్రతిష్టించారు.

Hyderabad: హైదరాబాద్‌తో అంబేద్కర్‌కు ప్రత్యేక అనుబంధం.. అదేంటో తెలుసా..!
B. R. Ambedkar

Updated on: Apr 13, 2023 | 9:05 PM

ఎందరో మహానుభావులు..! కానీ రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్‌ అంబేద్కర్‌కు తెలంగాణతో ఉన్న బంధం ప్రగాఢమైనది. హైదరాబాద్‌తో ఆయన అనుబంధం ప్రత్యేకమైనది! అందుకేకాబోలు..సీఎం కేసీఆర్‌ ఈ మహా సంకల్పం చేశారు. పీడిత జన బాంధవుడైన అంబేద్కర్‌ను.. 125 అడుగుల మహా విగ్రహరూపంలో ప్రతిష్టించారు.

ఎందరో మహానుభావులు..! కానీ రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్‌ అంబేద్కర్‌కు తెలంగాణతో ఉన్న బంధం ప్రగాఢమైనది. హైదరాబాద్‌తో ఆయన అనుబంధం ప్రత్యేకమైనది! అందుకేకాబోలు..సీఎం కేసీఆర్‌ ఈ మహా సంకల్పం చేశారు. పీడిత జన బాంధవుడైన అంబేద్కర్‌ను.. 125 అడుగుల మహా విగ్రహరూపంలో ప్రతిష్టించారు.

నీ సామాజిక న్యాయ భావన.. ఓ ప్రచండ శక్తి!

ఇవి కూడా చదవండి

బాబాసాహెబ్ మన రాజ్యాంగ నిర్మాత. శక్తిమంతమైన, ఆరోగ్యకరమైన, మరింత సమ్మిళిత సమాజ నిర్మాణానికి దోహదం చేసే ఒక మార్గదర్శక ప్రణాళికను, దార్శనికతను, కాలానుగుణ్యమైన చైతన్య శీల స్ఫూర్తిని రాజ్యాంగం ద్వారా ఆయన మనకు అందించారు. అంబేడ్కర్ అందరివాడు. కేవలం హిందూ మత దురాచారాల తాడితులు, పీడితులు అయిన దళితులు, ఇతర అణగారిన వర్గాల వారి నాయకుడు మాత్రమే కాదు, ప్రపంచ జనాభాలో ప్రథమ స్థానానికి శీఘ్రగతిన ప్రస్థానిస్తున్న భారతదేశపు సకల ప్రజల మహోన్నత నాయకుడు అంబేడ్కర్. ఆయన నిజమైన జాతీయవాది, నిక్కమైన దేశభక్తుడు.

అంబేద్కరిజం.. హైదరాబాద్‌కు ఐకాన్‌.. నాడు.. నేడు.. మాత్రమే కాదు భావితరాలకు అంబేద్కర్‌ అడుగుజాడే ఓ దిశానిర్దేశం. హైదరాబాద్‌లో అంబేద్కర్‌ అనుబంధం అంతలా మమేకమై వుంది. అప్పట్లో హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా సకల జనులకు దిశా నిర్దేశం చేశారు అంబేద్కర్‌. అప్పట్లో వెల్లువెత్తిన ఉద్యమాలను సమీక్షించారు. నిజాం రాజ్యంలో ఉన్నవారు జాతీయ స్థాయి సంస్థలలో సభ్యులుగా ఉండి కార్యకలాపాలు, ఉద్యమాలు నడపడం అభ్యంతరకరంగా ఉండేది. అందువల్ల ఆల్‌ ఇండియా షెడ్యూల్డ్‌ కాస్ట్స్‌ ఫెడరేషన్‌లో చేరడం ఇబ్బందికరంగా ఉండేది. అందువల్ల విడిగా షెడ్యూల్డ్‌ కాస్ట్స్‌ ఫెడరేషన్‌ను ఏర్పాటు చేసుకొమ్మని అంబేద్కర్‌ ఇక్కడి ఉద్యమకారులకు సూచించారు. 1943లో ఈ సంస్థ నాయకులు ఢిల్లీ వెళ్ళి అంబేద్కర్‌ను కలిసినప్పుడు వీరి కార్యకలాపాల గురించి తెలుసుకొని ఆయన ఎంతో సంతోషపడ్డారు. 1944 సెప్టెంబర్‌లో అంబేద్కర్‌ హైదరాబాద్‌కు వచ్చి బహిరంగ సభలో ప్రసంగించారు.

స్వదేశీ సంస్థానాలు స్వతంత్రంగా ఉండటాన్ని అంబేద్కర్‌ వ్యతిరేకించారు. 1950 మే నెలలో అంబేద్కర్‌ హైదరాబాద్‌ సందర్శించారు. ఈ పర్యటన సందర్భంగానే ఔరంగాబాద్‌లో అంబేద్కర్‌ సిద్ధార్థ కాలేజీ స్థాపించుకోవడానికి ఆ కాలంలోనే 12 లక్షల రూపాయల రుణ సహాయం అందచేశారు.

1950 డిసెంబర్‌ చివరి వారంలో అంబేద్కర్‌ మరొకమారు హైదరాబాద్‌ నగరానికి వచ్చారు. ప్రభుత్వ అతిథిగా వచ్చిన ఆయన లేక్‌వ్యూ గెస్ట్‌హౌజ్‌లో బస చేశారు. 1951 జనవరి ఒకటవ తేదీన హైదరాబాద్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వెల్లోడిని కలుసుకున్నారు. ఈ విధంగా ఉద్యమకాలమంతా హైదరాబాద్‌ ప్రభుత్వంతో, ఉద్యమకారులతో అంబేద్కర్‌ అనుబంధం పెనవేసుకుపోయింది.

అంతేకాదు, హైదరాబాద్‌ నగరాన్ని దేశానికి రెండో రాజధాని చేయాలని ఆనాడే ప్రతిపాదించారు డా.బీఆర్‌ అంబేద్కర్‌! అతిపెద్ద కంటోన్మెంట్‌, ఢిల్లీకి తీసిపోని పెద్దపెద్ద భవనాలతోబాటు భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా ఉన్న భాగ్యనగర శాంతియుత సహజీవనాన్ని ఆయన ఎంతో ఇష్టపడేవారు.

ప్రజల హృదయాలలో ఒక శాశ్వత స్థానాన్ని పొందిన మానవతా మూర్తి. జాతి శ్రేయస్సుకు; కాలం పద ఘట్టనల కింద, చరిత్ర క్రూరత్వానికి నలిగిపోతోన్న సంఖ్యానేక దురదృష్ట వంతులకు గౌరవప్రదమైన జీవితాన్ని సమకూర్చేందుకు ఆయన తన అసమాన న్యాయ శాస్త్ర ధురీణత, పాండిత్య ప్రజ్ఞతో అందించిన తోడ్పాటు విలువ కట్టలేనిది. బాబాసాహెబ్ దేనికోసమైతే తన జీవితాన్ని అంకితం చేశారో దానిపట్ల మనం సహానుభూతి చూపాలి; ఆ లక్ష్య పరిపూర్తికి ఆయన ప్రవచించిన విలువలు, నిర్దేశించిన పద్ధతులను మనం అనుసరించి తీరాలి. అదే ఆయన జీవిత కృషికి సార్థకత; స్మృతికి సముచిత నివాళి….రాజ్యాంగ నిర్మాత, స్ఫూర్తి మూర్తి విగ్రహావిష్కరణ వేడుక.

అస్పృశ్యత మన సమాజ జీవితంలో ఇంకా ఊపిరి పీలుస్తూనే ఉన్నది. ఈ దృష్ట్యా సకల సామాజిక వ్యత్యాసాలను సంపూర్ణంగా రూపుమాపేందుకు ఇంకా కృషిచేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. జీవిత హుందా ఏమిటో తెలియకుండా బతుకు సమరం చేస్తున్న అసంఖ్యాకులకు సమగ్ర సాధికారిత కల్పించాలి. కుల మతాలు, సంప్రదాయాలు, ప్రాంతీయతలు మొదలైన సంకుచితత్వాలకు అతీతంగా వ్యవహరించాలి. నాగరీక విలువలతో ప్రవర్తించాలి. మన భారతదేశాన్ని విశ్వగురుగా సుప్రతిష్ఠితం చేయాలి. బుగ్వేద ఋషులు అభిలషించిన విధంగా ఉత్తమోత్తమ భావాలు అన్ని వైపులా నుంచీ మన జాతి జీవనంలోకి, వ్యక్తిగత జీవితాలలోకి ప్రవేశించాలి. ఇప్పుడు మనం ఒక సత్ లక్ష్యంతో పాటిస్తున్న అమృత కాలంలో, మన మనుగడను సమున్నతం చేస్తున్న ఆ ఉదాత్త భావాలు విశ్వవ్యాప్తంగా విస్తరిల్లేందుకు యావద్భారతీయులమూ యథాశక్తి తోడ్పడాలి.

భారత భాగ్యవిధాతా జోహార్‌!

(టీవీ9 డెస్క్ స్పెషల్)