AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఇద్దరు పంతులమ్మల మధ్య విభేదాలు.. బాలికలను చితకబాదిన వైస్ ప్రిన్సిపల్

Telangana: జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమశాఖ గురుకుల బాలికల పాఠశాలలో జరిగింది. రమాదేవి అనే వైస్ ప్రిన్సిపాల్ ఐదుగురు 9వ తరగతి చదువుతున్న ఐదుగురు బాలికలను చితికబాదింది. చేతులకు వాతలు వచ్చేలా కర్రతో కొట్టింది. టీచర్స్ మధ్య వ్యక్తిగత విభేదాలు పిల్లలపై చూపడం ఏంటని బాలికల తల్లిదండ్రులు ప్రశ్నించారు..

Telangana: ఇద్దరు పంతులమ్మల మధ్య విభేదాలు.. బాలికలను చితకబాదిన వైస్ ప్రిన్సిపల్
G Peddeesh Kumar
| Edited By: Subhash Goud|

Updated on: Feb 06, 2025 | 7:04 PM

Share

ఇద్దరు పంతులమ్మల మధ్య విభేదాలు బాలికల పాలిట శాపమైంది. గురుకుల పాఠశాలలో తనకు గిట్టని టీచర్ తో ఎక్కువ సమయం కేటాయించారని ఓ వైస్ ప్రిన్సిపల్ కర్కశంగా ప్రవర్తించిందని బాధిత బాలికలు ఆవేదన వ్యక్తంచేశారు. స్టడీ వరకు ఎందుకు ఆలస్యమైందని ఐదుగురు బాలికల చేతులకు వాతలు వచ్చేలా కొట్టిందని వారు ఆరోపించారు. విషయం తెలుసుకున్న బాధిత బాలికల తల్లిదండ్రులు గురుకుల పాఠశాల ముందు ఆందోళన దిగారు.

ఈ సంఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమశాఖ గురుకుల బాలికల పాఠశాలలో జరిగింది. రమాదేవి అనే వైస్ ప్రిన్సిపాల్ ఐదుగురు 9వ తరగతి చదువుతున్న ఐదుగురు బాలికలను చితికబాదింది. చేతులకు వాతలు వచ్చేలా కర్రతో కొట్టింది. చేతులు కమలిపోయి అన్నం కూడా తినలేని పరిస్థితిలో ఉన్న ఆ బాలికలు వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వాళ్ళ చేతులపై వాతలు చూసి ఆందోళన చెందిన బాలికల తల్లిదండ్రులు వైస్ ప్రిన్సిపల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు గిట్టని టీచర్ తో విద్యార్థులు ఎక్కువ సమయం కేటాయించారని.. విభేదాలు ఉండడం వల్ల ఆ టీచర్ పై ఉన్న కోపాన్ని పిల్లలపై చూపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీచర్స్ మధ్య వ్యక్తిగత విభేదాలు పిల్లలపై చూపడం ఏంటని బాలికల తల్లిదండ్రులు ప్రశ్నించారు. పిల్లల చేతులు కమిలిపోయెలా ఎలా కొడతారని తల్లిదండ్రులు ప్రశ్నించారు. బాలికలను విచక్షణారహితంగా కొట్టిన వైస్ ప్రిన్సిపల్ రమాదేవి పై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. చివరకు గురుకుల పాఠశాల సిబ్బంది బాలికల తల్లిదండ్రులతో మాట్లాడి నచ్చచెప్పడంతో ఆందోళన విరమించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!