AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు.. వారం రోజుల డెడ్‌లైన్..

కులగణన.. కాంగ్రెస్‌కు ఇంటా-బయట కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. విపక్షాలే కాదు సొంత పార్టీ నాయకులు కూడా బహిరంగ విమర్శలు చేయడంపై పీసీసీ సీరియస్ అయింది. తీన్మార్‌ మల్లన్నకు నోటీసులు ఇచ్చి.. టైం బౌండ్‌ పెట్టి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇంతకీ మల్లన్నకు ఇచ్చిన నోటీసుల్లో ఏముంది?.

తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు.. వారం రోజుల డెడ్‌లైన్..
Teenmar Mallanna
Ravi Kiran
|

Updated on: Feb 06, 2025 | 9:15 PM

Share

తీన్మార్ మల్లన్నకు వారం రోజుల డెడ్ లైన్ విధించింది పీసీసీ క్రమశిక్షణ కమిటీ. కులగణనపై ఇష్టారీతిన మాట్లాడటం, నివేదికను తగలబెట్టడాన్ని సీరియస్‌గా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. పార్టీ లైన్ దాటి మాట్లాడటం, కులగణనపై తీవ్ర విమర్శలు చేయడంపై వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసులు ఇచ్చింది పీసీసీ క్రమశిక్షణ కమిటీ. ఈ నెల 12లోగా రిప్లై ఇవ్వాలని ఆదేశించింది.

దేశంలోనే మొదటిసారి కులగణన చేసిన పార్టీగా రికార్డ్ సృష్టించామని, ముఖ్యమంత్రి రేవంత్ దీనిపై అసెంబ్లీలో ప్రకటన కూడా చేశారని కాంగ్రెస్ చెప్తుంది. పార్టీ ప్రజా ప్రతినిధిగా ఎమ్మెల్సీ హోదాలో ఉండి పార్టీ నాయకత్వం, ప్రభుత్వం నిర్వహించిన సర్వేపై విమర్శలు చేయడం కరెక్ట్ కాదన్నది. పట్టభద్రుల ఎన్నికల్లో పార్టీ బీఫామ్ ఇచ్చి గెలిపిస్తే.. ఈ విధంగా ప్రవర్తించడం బాగోలేదని.. పార్టీ నామ్స్ అండ్ గైడ్‌లైన్స్ పాటించనందుకు వారంలో వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసుల్లో పేర్కొన్నారు.

వరంగల్ సభలో ఒక కులాన్ని దూషిస్తూ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు ఇచ్చామన్నారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షి. వివరణ ఇచ్చాక చర్యలు తీసుకుంటామని తెలిపారు. బీసీ కులగణన సర్వేతో పాటు.. ఒక వర్గాన్ని టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్న తీన్మార్ మల్లన్న.. కాంగ్రెస్ షోకాజ్ నోటీసులకు ఏ విధంగా బదులిస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి

Follow Us
ఆ హీరోయిన్ రోజూ మద్యం తాగేది.. చివరకు అలా చనిపోయింది
ఆ హీరోయిన్ రోజూ మద్యం తాగేది.. చివరకు అలా చనిపోయింది
ఇల్లు తుడిచే నీటిలో ఇదొక్కటి కలిపితే చాలు.. క్రిమికీటకాలు పరార్
ఇల్లు తుడిచే నీటిలో ఇదొక్కటి కలిపితే చాలు.. క్రిమికీటకాలు పరార్
ఏలినాటి శని ఉన్నవారికి షాకింగ్ న్యూస్.. అసలు ఏం జరుగుతుందంటే?
ఏలినాటి శని ఉన్నవారికి షాకింగ్ న్యూస్.. అసలు ఏం జరుగుతుందంటే?
టీ తాగుతున్నారా?.. జాగ్రత్త ఈ 6 విషయాలు తెలుసుకోకపోతే.. అంతే!
టీ తాగుతున్నారా?.. జాగ్రత్త ఈ 6 విషయాలు తెలుసుకోకపోతే.. అంతే!
సంజూ శాంసన్ కంబ్యాక్‌కు సిద్ధం.. జట్టులో చోటు దక్కేది ఎవరికో?
సంజూ శాంసన్ కంబ్యాక్‌కు సిద్ధం.. జట్టులో చోటు దక్కేది ఎవరికో?
CSIR UGC NET 2026 జూన్ పరీక్ష రాసే వారికి అలర్ట్.. తాజా అప్‌డేట్‌
CSIR UGC NET 2026 జూన్ పరీక్ష రాసే వారికి అలర్ట్.. తాజా అప్‌డేట్‌
ప్రజల కలలు, సంకల్పమే దేశ పురోగతికి చోదకశక్తిః ప్రధాని మోదీ
ప్రజల కలలు, సంకల్పమే దేశ పురోగతికి చోదకశక్తిః ప్రధాని మోదీ
పాన్ కార్డు అసలైందా..? కాదా? ఈ ట్రిక్‌తో గుర్తు పట్టేయండి..
పాన్ కార్డు అసలైందా..? కాదా? ఈ ట్రిక్‌తో గుర్తు పట్టేయండి..
అత్యాశతో ప్రాణాలు పోగొట్టుకున్న తెలివిలేని నక్క..!
అత్యాశతో ప్రాణాలు పోగొట్టుకున్న తెలివిలేని నక్క..!
ఈడొచ్చిన అమ్మాయిలు తప్పక తినాల్సిన పచ్చి కొబ్బరి లడ్డూలు..
ఈడొచ్చిన అమ్మాయిలు తప్పక తినాల్సిన పచ్చి కొబ్బరి లడ్డూలు..