ఆ నమ్మకమే నడిపించింది..! అంగవైకల్యంతో ఉన్న వ్యక్తి.. 200 కి.మీటర్లు ఇలా కాలినడకన..

ఇలా 200 కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేశారు. ఈ హృదయ విదారకమైన దృశ్యం పలువురి మనసును చలించి వేసింది. వికలాంగుడు కావడం, హార్ట్ సమస్య తో పాటు తన కూతురుకు కూడా హార్ట్ ప్రాబ్లమ్‌ ఉండటంతో అంతా ఆ దేవుని పైనే భారం వేసి బ్రతుకుతున్నామని ధీనంగా చెప్పుకున్నారు.

ఆ నమ్మకమే నడిపించింది..! అంగవైకల్యంతో ఉన్న వ్యక్తి.. 200 కి.మీటర్లు ఇలా కాలినడకన..
Disabled Man with heart problem

Edited By: Jyothi Gadda

Updated on: Oct 14, 2024 | 11:34 AM

భగవంతుణ్ణి పై భక్తి ఒక నమ్మకం. కోటీశ్వరుడి నుంచి కూటికి కూడా ఇబ్బంది పడే పేదవాడి వరకు భగవంతునికి మొక్కులు చెల్లిస్తుంటారు. కొందరు ఐశ్వర్యం కోసం…మరి కొందరు ఆరోగ్యం బాగుపడాలని దేవుణ్ణి పై నమ్మకంతో మొక్కులు చెల్లిస్తుంటారు. మరికొందరు భక్తులు కాలి నడకన దైవ దర్శనానికి వెళ్తుంటారు. అలాంటి భక్తితో ఒక అంగ వైకల్యం కలిగిన ఓ పేద భక్తుడు తనకు మించిన సాహాసం చేశాడు. ఆంధ్రా లోని విసన్నపేట వద్ద కలగర నుంచి సత్తుపల్లి మీదుగా జంగారెడ్డిగూడెం వద్ద మద్ది ఆంజనేయ స్వామి ఆలయానికి కాలి నడక వెళ్లి మొక్కులు తీర్చుకున్నాడు.

తనకు హార్ట్ లో సమస్య ఉందని, డాక్టర్లు వైద్య పరీక్షలు చేసి సర్జరీ చెయ్యాలని చెప్పారట. అసలే పేదరికం..అలాంటిది ఖర్చు తో కూడుకున్న హార్ట్ సర్జరీ చేయించుకునేందుకు ఆర్థిక స్థోమత లేక మద్ది ఆంజనేయ స్వామి పై నమ్మకంతో తనకు జబ్బు నయం అయితే కాలి నడక వస్తానని మొక్కుకున్నాడట. ఈ క్రమంలోనే ఆ తరువాత కొద్ది రోజులకు తనకు ఎలాంటి హార్ట్ సర్జరీ చెయ్యాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పడంతో ఆ భగవంతుడే నయం చేశాడని నమ్మకంతో కాలి నడకన బయల్దేరాడు.

ఈ వీడియో చూడండి..

ఇవి కూడా చదవండి

అయితే, తాను వికలాంగుడు కావడంతో 3 చక్రాల సైకిల్ పై కూర్చుంటే.. భార్య ఒక క్లాత్ తో బండి లాగుతోంది. వెనుక నుంచి కూతురు ఆ 3 చక్రాల సైకిల్ ను నెడుతూ సహాయ పడుతోంది. ఇలా 200 కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేశారు. ఈ హృదయ విదారకమైన దృశ్యం పలువురి మనసును చలించి వేసింది. వికలాంగుడు కావడం, హార్ట్ సమస్య తో పాటు తన కూతురుకు కూడా హార్ట్ ప్రాబ్లమ్‌ ఉండటంతో అంతా ఆ దేవుని పైనే భారం వేసి బ్రతుకుతున్నామని ధీనంగా చెప్పుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..