Fuel Crisis: నిర్మల్ జిల్లాలో డీజిల్ కొరత.. పెట్రోల్ పంపుల్లో నో స్టాక్ బోర్డు.. అసలు కారణం ఇదేనా?..
Fuel Crisis: నిర్మల్ జిల్లాలో డీజిల్ దొరకడం లేదు. అవును, మీరు విన్నది నిజమే. అదేంటి, ఇక్కడేమైనా శ్రీలంకలాంటి పరిస్థితులు వచ్చాయా అనుకోకండి.

Fuel Crisis: నిర్మల్ జిల్లాలో డీజిల్ దొరకడం లేదు. అవును, మీరు విన్నది నిజమే. అదేంటి, ఇక్కడేమైనా శ్రీలంకలాంటి పరిస్థితులు వచ్చాయా అనుకోకండి. అలాంటిదేం లేదు. పెట్రోల్ బంకుల్లో డీజిల్ స్టాక్ కావాల్సినంత ఉంది. కానీ, డీజిల్ అమ్మమంటున్నారు పెట్రోల్ బంక్స్ ఓనర్స్. చెప్పడమే కాదు.. నో స్టాక్ బోర్డులు కూడా పెట్టేశారు. కొన్ని బంకుల్లో నిజంగానే డీజిల్ స్టాక్ లేదనే మాట వినిపిస్తున్నా.. సడన్‌గా పెట్రో రేట్లు తగ్గించడం, ఆ మేరకు పెట్రోల్ బంకులకు ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వకపోవడంతోనే డీజిల్ అమ్మకాలను నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా పెద్దమొత్తంలో రేట్లు తగ్గించడంతో చాలా లాస్ అయ్యామంటున్నారు బంక్ ఓనర్స్.
మెజారిటీ బంకుల్లో డీజిల్ నో స్టాక్ బోర్డులు పెట్టడంతో మిగతా బంకుల్లో రద్దీ పెరిగింది. డీజిల్ కోసం బారులు తీరుతున్నారు వాహనదారులు. నాలుగైదు గంటలు పడిగాపులు పడినా డీజిల్ దొరకడం లేదంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నాడు ఓ కస్టమర్. నిర్మల్ జిల్లాలో డీజిల్ దొరకకపోవడంతో మహారాష్ట్రకు క్యూ కడుతున్నారు వాహనదారులు. అయితే, ప్రజెంట్ నిర్మల్ జిల్లా వరకే పరిమితమైన ఈ పరిస్థితి, ఈరోజోరేపో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగాను, పక్క జిల్లాలకు వ్యాపించే సిట్యువేషన్ కనిపిస్తోంది. డీజిల్ కొరతకు ఆయిల్ కంపెనీల నుంచి స్టాక్ రాకపోవడం ఒక కారణమైతే, పెట్రోల్ బంకులకు ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వకపోవడం మరో కారణంగా తెలుస్తోంది.
