AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Neem Tree: వేప చెట్లకు వింత తెగులు.. ఇలా చేస్తే తగ్గుతుందంటున్న పరిశోధకులు..

కొమ్మల ముడత/ డైబ్యాక్ అని పిలువబడే విధ్వంసక వ్యాధి కారణంగా వేప చెట్లు ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఇది అన్ని వయసులు, అన్ని పరిమాణాల వేప చెట్ల ఆకులు, కొమ్మలు, పుష్పగుచ్ఛాలను ప్రభావితం చేస్తుంది.

Neem Tree: వేప చెట్లకు వింత తెగులు.. ఇలా చేస్తే తగ్గుతుందంటున్న పరిశోధకులు..
Neem Tree
Shiva Prajapati
|

Updated on: Dec 13, 2022 | 4:05 PM

Share

కొమ్మల ముడత/ డైబ్యాక్ అని పిలువబడే విధ్వంసక వ్యాధి కారణంగా వేప చెట్లు ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఇది అన్ని వయసులు, అన్ని పరిమాణాల వేప చెట్ల ఆకులు, కొమ్మలు, పుష్పగుచ్ఛాలను ప్రభావితం చేస్తుంది. ఆగస్టు-డిసెంబర్‌లో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తోంది. వర్షాకాలం మొదలైన సమయంలో లక్షణాలు కనిపించడం మొదలవుతుంది. వర్షాకాలం చివరి భాగంలో, శీతాకాలంలో క్రమంగా ఈ వ్యాధి తీవ్రమవుతుంది.

అయితే, ఈ వ్యాధి నివారణకు నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. వాటిని పాటించడం ద్వారా వేప చెట్టును క్షీణింపజేస్తున్న తెగులు తగ్గుతుందని చెబుతున్నారు. విత్తనం విత్తే సమయంలో, శిలీంద్రనాశకాలు లేదా బయో నియంత్రిత ఏజెంట్లతో విత్తన శుద్ధి సంక్రమణను తగ్గిస్తుంది. మొలక, నారు దశలో కార్బండాజిమ్ 2.5 గ్రాములు లీటరు నీటికి లేదా ట్రైకోడెర్మా వంటి బయోకంట్రోల్ శిలీంద్రనాశకాల నివారణ స్ప్రేలు ఖచ్చితంగా నారు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వ్యాధులకు నిరోధకతను కలిగిస్తాయి. వేప చెట్టు స్వాభావికంగా వ్యాధిని చాలా తట్టుకుంటుంది. తరచుగా ఫంగస్ వల్ల కలిగే నష్టాన్ని భర్తీ చేయగలదు. ఎటువంటి బాహ్య ప్రమేయం లేకుండా వ్యాధితో పోరాడి జీవించగలదు.

ఈ మధ్య కాలంలో వేప చెట్లకు ఈ తెగులు ఎక్కువ అవుతుండటం, చాలా వరకు చెట్లు నశించిపోతుండటంతో.. ములుగులోని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూ‌ట్‌ లాబొరేటరీ పరిశోధనలు చేసింది. వ్యాధికారకాన్ని ఫోమోప్సిస్ అజాడిరచ్టేగా గుర్తించారు. తెలంగాణలో వరుసగా మూడేళ్లుగా మళ్లీ వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది.

ఇవి కూడా చదవండి

ఏది ఏమైనప్పటికీ, మన వేప చెట్లు డైబ్యాక్ వల్ల కలిగే నష్టాన్ని ఎదుర్కోవడానికి చాలా బలంగా ఉన్నాయి. చెట్లు, వ్యాధికారక క్రిములు సహ-పరిణామం చెందుతాయి. కాలానుగుణంగా చెట్లపై వివిధ తీవ్రతతో వ్యాధులు సంభవిస్తాయి అనే వాస్తవాన్ని అంగీకరించేంత బలంగా ఉండాలి. వేప డైబ్యాక్, ఇతర చెట్ల వ్యాధులకు సంబంధించిన ఏవైనా సందేహాల నివృత్తి కోసం ఫారెస్ట్ కాలేజీ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ వారు ఫోన్ నెంబర్ విడుదల చేశారు. వేప మొక్కల వ్యాధులకు సంబంధించి ఏవైనా సందేహాలుంటే ప్లాంట్ పాథాలజిస్ట్ డాక్టర్ జగదీష్ ఫోన్ నెంబర్ 9705893415 ని సంప్రదించవచ్చు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..