YS Sharmila: విమర్శలు చేసుకోడం సర్వ సాధారణం.. షర్మిల పాదయాత్రకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్..

వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్రకు తెలంగాణ హైకోర్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  వరంగల్ పోలీసులు పాదయాత్రకు అనుమతిని ఇవ్వకపోవడంతో వైఎస్ఆర్‌టీపీ నేతలు మంగళవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

YS Sharmila: విమర్శలు చేసుకోడం సర్వ సాధారణం.. షర్మిల పాదయాత్రకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్..
YS Sharmila
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 13, 2022 | 3:59 PM

వైఎస్ఆర్‌ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు మంగళవారంనాడు అనుమతి ఇచ్చింది. గతంలో విధించిన షరతులు గుర్తుంచుకోవాలని సూచించింది. షర్మిల తరపున న్యాయవాది వరప్రసాద్ వాదనలు విన్న హైకోర్టు.. రాష్ట్రంలో షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్రకు అనుమతి ఇచ్చింది. కోర్టు అనుమతి ఇచ్చిన తర్వాత కూడా పోలీసులు అనుమతి ఎలా నిరాకరిస్తారన్నారని హైకోర్టు ప్రశ్నించింది.పాదయాత్రకు హైకోర్టు పర్మిషన్ ఇచ్చినా కూడా పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని షర్మిల కోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ ను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు విచారణ జరిపింది.

వాదనలు ఇలా సాగాయి..

ప్రభుత్వం తరఫు న్యాయవాది(Government Advocate and Public Prosecutor):  రాజ్ భవన్ నుంచి బయటకి వచ్చాక వైఎస్ఆర్‌ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల అభ్యంతకర వాఖ్యలు చేశారు.

హై కోర్టు: రాజ్‌భవన్ దగ్గర వాఖ్యలు చేస్తే పాదయాత్రను ఎందుకు అనుమతి నిరాకరించారు.

ప్రభుత్వం తరఫు న్యాయవాది: టీఆర్ఎస్ నేతలపై షర్మిల అభంతకర వాఖ్యలు చేశారు.

హై కోర్టు: ఏ నేత పై వాఖ్యలు చేశారో వాళ్ళు కోర్ట్‌కు రాకుండా మీరెందుకు వాదిస్తునారు.

హై కోర్టు: హైదరాబాద్‌లో ఉంటూ రాష్ట్రంపై ఇలా వాఖ్యనించడం సరికాదు

హై కోర్టు: రాజకీయ నాయకులు ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకోడం సర్వ సాధారణం

లోటస్ పాండ్ వద్ద టెన్షన్..

మరోవైపు లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. లోటస్ పాండ్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. షర్మిలను గేటు వద్దే అడ్డుకున్నారు. దీనితో షర్మిల పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో షర్మిలకు పోలీసులకు మధ్య వాగ్వాదం నెలకొంది.

వరంగల్ జిల్లాలో ఏం జరిగిందంటే..

ఈ ఏడాది నవంబర్ 28న నర్సంపేటలో బీఆర్ఎస్ శ్రేణులు వైఎస్ షర్మిల బస్సును దగ్ధం చేశారు. వైఎస్ఆర్‌టీపీ వాహనాలను ధ్వంసం చేశారు. నవంబర్ 27న నర్సంపేటలో నిర్వహించిన సభలో స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై విమర్శలు చేశారు. విమర్శలకు షర్మిల క్షమాపణ చెప్పాలని అప్పటి బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన నిర్వహించాయి.

దీంతో వైఎస్ఆర్‌టీపీ వాహానాలను ధ్వంసం చేశారు. అంతేకాదు షర్మిలను పోలీసులను అదుపులోకి తీసుకొని హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లోని షర్మిల నివాసంలో వదిలివెళ్లారు. అయితే నవంబర్ 28న ప్రగతి భవన్ వద్ద దెబ్బతిన్న వాహనాలతో ప్రగతి భవన్ వద్ద ధర్నా చేసేందుకు వెళ్తున్న షర్మిలను పోలీసులు పంజాగుట్ట వద్ద పోలీసులు అడ్డుకున్నారు.

అదే రోజున పాదయాత్రకు అనుమతి కోరుతూ తెలంగాణ హైకోర్టులో వైఎస్ఆర్‌టీపీ నేతలు పిటిషన్ ను దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన హైకోర్టు పాదయాత్రకు అనుమతిని ఇచ్చింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం