Telangana Elections: నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ ను బీఆర్ఎస్ టార్గెట్ చేసిందా..? సీఎం కేసీఆర్, కేటీఆర్ వ్యూహమేంటి..
ఆ జిల్లాలో బ్రదర్స్ కు తిరుగులేదా..? వారికి ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయా..? అయితే బ్రదర్స్‌ను బీఆర్ఎస్ టార్గెట్ చేసిందా..? పూర్వ బ్రాండ్ ఇమేజ్ కోసం ఆ బ్రదర్స్ సర్వశక్తులు ఒడ్డుతున్నారా..? ఆ బ్రదర్స్ పై సీఎం కేసీఆర్, కేటీఆర్ విమర్శల దాడిని పెంచారా..? దత్తత పేరుతో కోమటిరెడ్డి బ్రదర్స్ కు చెక్ పెట్టాలని బీఆర్ఎస్ భావిస్తోందా..? ఎందుకు కోమటిరెడ్డి బ్రదర్స్ ను బీఆర్ఎస్ టార్గెట్ చేసింది..?

ఆ జిల్లాలో బ్రదర్స్ కు తిరుగులేదా..? వారికి ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయా..? అయితే బ్రదర్స్‌ను బీఆర్ఎస్ టార్గెట్ చేసిందా..? పూర్వ బ్రాండ్ ఇమేజ్ కోసం ఆ బ్రదర్స్ సర్వశక్తులు ఒడ్డుతున్నారా..? ఆ బ్రదర్స్ పై సీఎం కేసీఆర్, కేటీఆర్ విమర్శల దాడిని పెంచారా..? దత్తత పేరుతో కోమటిరెడ్డి బ్రదర్స్ కు చెక్ పెట్టాలని బీఆర్ఎస్ భావిస్తోందా..? ఎందుకు కోమటిరెడ్డి బ్రదర్స్ ను బీఆర్ఎస్ టార్గెట్ చేసింది..?
రాష్ట్ర రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్‌ను పరిచయం చేయాల్సిన పనిలేదు. వారే ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. నిత్యం ఏదో ఒక హాట్ కామెంట్స్‌తో కోమటిరెడ్డి బ్రదర్స్ తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రాండ్ ఇమేజ్.. నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌కు ఆయువుపట్టుగా ఉండేది. ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌లో హేమాహేమీలైన.. మాజీ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రులు కుందూరు జానారెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి లాంటి ఉద్ధండ నేతలు ఉన్నా.. కోమటిరెడ్డి బ్రదర్స్‌ది రూటే సెపరేటు. ఉమ్మడి జిల్లాలో నల్లగొండ, నకిరేకల్, మునుగోడు, భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి లతోపాటు ఇబ్రహీంపట్నం, జనగామ నియోజక వర్గాల్లో బలమైన క్యాడర్ ఉంది. ఇక్కడ అభ్యర్థి ఎవరైనా గెలుపోటములను శాంచించే సత్తా వీళ్లకుంది.
కోమటిరెడ్డి బ్రదర్స్ నిత్యం సీఎం కేసీఆర్‌ను టార్గెట్ గా చేసుకొని విమర్శిస్తున్నారు. అవినీతి, కుటుంబ పాలన సాగిస్తున్న కెసిఆర్ ను గద్దె దించడమే తమ లక్ష్యమంటూ పేర్కొంటున్నారు. దీంతో ఈ ఇద్దరి బ్రదర్స్ కు చెక్ పెట్టాలని బీఆర్ఎస్ స్కెచ్ వేసింది. నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ కు కొరకు రాని కొయ్యగా మారిన వీరిద్దరిని ఎదుర్కొనే వ్యూహంతో బీఆర్ఎస్ ముందుకు సాగుతోంది. రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పాలని పట్టుదలగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ కు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ముఖ్యంగా బ్రదర్స్ పోటీ చేస్తున్న నల్లగొండ, మునుగోడు స్థానాలతోపాటు తమకు పట్టున్న నకిరేకల్ లో కూడా గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
నల్లగొండ నుంచి వరుసగా నాలుగు సార్లు ఎన్నికైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యాడు. కాంగ్రెస్ పాలనలో వెనుకబడ్డ నల్లగొండ నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. దీంతో బీఆర్ఎస్ కు ప్రజలు పట్టం కట్టారు. ఈ సారి ఎలాగైనా గెలిచి తన పట్టు నిరూపించుకోవాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కసిగా ఉన్నారు. కొరకరాని కొయ్యగా మారిన వెంకట్ రెడ్డిని మరోసారి ఎలాగైనా ఓడించాలనే వ్యూహంతో కేసీఆర్ ఉన్నారు. నల్లగొండ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మరోసారి నల్లగొండ దత్తత అంశాన్ని లేవనెత్తారు. నల్లగొండ నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని 1300 కోట్ల రూపాయలతో కొంత అభివృద్ధి చేశామని.. ఇంకా దత్తత అభివృద్ధి పనులు పూర్తి కాలేదని ఆయన గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ గెలిపించాలని సీఎం కేసీఆర్ కోరారు. నల్లగొండ నియోజకవర్గంలో పర్యటించిన సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లు.. పలుసార్లు దత్తత అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇలా దత్తత పేరుతో మరోసారి నల్లగొండలో గులాబీ జెండా ఎగరవేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది.
రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నయం బిజెపి అంటూ 16 నెలల క్రితం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ రాజీనామా చేసి మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అవినీతి, కుటుంబ పాలన సాగిస్తున్న కేసీఆర్ గద్దె దించే లక్ష్యంతో సొంత గూటి (కాంగ్రెస్)కి వచ్చానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెబుతున్నారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. దత్తతలో భాగంగానే చండూర్ ను రెవెన్యూ డివిజన్, గట్టిప్పల్ మండలాన్ని ఏర్పాటు చేశారు. ఇంకా పలు అభివృద్ధి పనులు నియోజకవర్గంలో కొనసాగుతున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బిజెపి అభ్యర్థిగా చలమల్ల కృష్ణారెడ్డి బరిలో ఉన్నారు.
మునుగోడు నుంచి ఈ సారి గెలిచి తన సత్తా చాటాలని పట్టుదలతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెక్ పెట్టేందుకు బీఆర్ఎస్ తిరిగి దత్తత అస్త్రాన్ని ప్రయోగించింది. చౌటుప్పల్ రోడ్ షో లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ మునుగోడు నియోజక వర్గాన్ని దత్తత తీసుకున్నామని ఇంకా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ కు పట్టం కట్టాలని ఆయన కోరారు.
ఉమ్మడి నల్గొండ జిల్లా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న గులాబీ అధిపతి కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లు మాత్రం కోమటిరెడ్డి బ్రదర్స్ టార్గెట్ గా చేసుకొని విమర్శలను ఎక్కుపెడుతున్నారు. నకిరేకల్ లో పూర్వ అనుచరుడు బీఆర్ఎస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్యపై కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయ కక్ష కట్టారని బీఆర్ఎస్ కెసిఆర్, కేటీఆర్ లు మండిపడుతున్నారు. డబ్బు మదంతో కోమటిరెడ్డి బ్రదర్స్ రెచ్చిపోతున్నారంటూ కేసిఆర్, కేటీఆర్ లు విమర్శల దాడి చేస్తున్నారు. ఈ ఎన్నికల్లోనూ కోమటిరెడ్డి బ్రదర్స్ కు గుణపాఠం చెప్పాలని పిలుపు నిస్తున్నారు. నకిరేకల్ లో గులాబీ జెండాను ఎగరవేసి.. చిరుమర్తి లింగయ్యను టార్గెట్ చేసిన కోమటిరెడ్డి బ్రదర్స్ పై పై చేయి సాధించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. దత్తత పేరుతో నల్లగొండ, మునుగోడులలో గులాబీ జెండాను ఎగరవేసి కోమటిరెడ్డి బ్రదర్స్ కు చెక్ పెట్టాలని బీఆర్ఎస్ వ్యూహంతో ముందుకు సాగుతోంది.
ఇలా నల్లగొడ రాజకీయం రసవత్తరంగా మారింది. నల్లగొండ జిల్లాలో బలమైన నేతలుగా పేరున్న కోమటిరెడ్డి బ్రదర్స్ ను దత్తత రాజకీయాలతో బీఆర్ఎస్ చెక్ పెడుతుందో లేదో చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..