AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TV9 Conclave: తెలంగాణ సమాజం ఏం ఆలోచిస్తోంది?.. అతిరథ మహారధులతో నాన్‌స్టాప్ చర్చలు.. మరికాసేపట్లో టీవీ9 మెగా పొలిటికల్ కాన్‌క్లేవ్

తెలంగాణ దంగల్‌లో ఇక నో మోర్ కన్‌ఫ్యూజన్‌. రాజకీయాలు ఎన్ని రంగులు మారినా.. ట్రెండ్ ఎటువైపు నుంచి ఎటువైపునకు తిరిగినా... గ్యారంటీలతో గందరగోళానికి గురిచేసినా.. మేనిఫెస్టోలతో ఎవరెన్ని మేజిక్కులు చేసినా... బే ఫికర్. ఏది ఒరిజినల్ ఖద్దరు.. ఏది నకిలీ ఖద్దరు ఇట్టే తేలబోతోంది. తెలంగాణా ఓటరు పక్షాన నిలబడి.. లీడర్లు, ఎనలిస్టులతో మారథాన్‌ డిబేట్‌కి సిద్ధమైంది టీవీ9.

Shaik Madar Saheb
|

Updated on: Nov 23, 2023 | 8:31 AM

Share

తెలంగాణ దంగల్‌లో ఇక నో మోర్ కన్‌ఫ్యూజన్‌. రాజకీయాలు ఎన్ని రంగులు మారినా.. ట్రెండ్ ఎటువైపు నుంచి ఎటువైపునకు తిరిగినా… గ్యారంటీలతో గందరగోళానికి గురిచేసినా.. మేనిఫెస్టోలతో ఎవరెన్ని మేజిక్కులు చేసినా… బే ఫికర్. ఏది ఒరిజినల్ ఖద్దరు.. ఏది నకిలీ ఖద్దరు ఇట్టే తేలబోతోంది. తెలంగాణా ఓటరు పక్షాన నిలబడి.. లీడర్లు, ఎనలిస్టులతో మారథాన్‌ డిబేట్‌కి సిద్ధమైంది టీవీ9.. అందరి ఫోకస్ ఆ నవంబర్‌ 30పైనే.. మూడు ప్రధాన పార్టీల గుండెల్లో దడ పెరుగుతోంది. అటు.. తెలంగాణ ఓటరు మదిలో కూడా గందరగోళమే. ఈ హైటైమ్‌లో హిస్టారికల్ ఎలక్టోరల్ ఎక్స్‌పరిమెంట్‌కి సిద్దమైంది టీవీ9. మెగా పొలిటికల్ కాన్‌క్లేవ్… ఆన్ ది వే.. మరి కాసేపట్లో ప్రారంభం కానుంది..

తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో అతిరథ మహారధులందరూ ఒకేచోట కొలువుదీరి.. పొలిటికల్ ట్రెండ్‌పై తమతమ అమూల్యమైన అభిప్రాయాల్ని పంచుకుంటారు. ఓటెవరికి అనే కన్‌ఫ్యూజన్‌లో ఉన్న జనానికి ఓరల్ సపోర్ట్‌గా నిలబడతారు. గురువారం ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు 12 గంటల పాటు జరగబోతోంది ఈ మారథాన్ డిబేట్‌.

మంత్రులు కేటి. రామారావు, మల్లారెడ్డి, మజ్లిస్ నేత అసదుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి, బీజేపీ జాతీయ నేత ప్రకాశ్ జవ్‌దేవకర్ లాంటి పక్కా పొలిటికల్సే కాదు.. సామాజిక రాజకీయాల్ని ప్రభావితం చేసే ఆర్‌ క్రిష్ణయ్య, మందక్రిష్ణ మాదిగ అండ్ అదర్స్ కూడా టీవీ9 కాంక్లేవ్‌లో స్పెషల్ ఎట్రాక్షన్స్ కాబోతున్నారు. టోటల్‌గా ఈ ఎలక్షన్ టైమ్‌లో తెలంగాణ సమాజం ఏం ఆలోచిస్తోందో తేల్చే ప్రయత్నం చేస్తారు. తెలుగు మీడియా చరిత్రలో ఇదొక రేరెస్ట్ ఫీట్‌.