AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

D Srinivas: తండ్రితో లైవ్‌లో ఫోన్ మాట్లాడిన సంజయ్.. డీఎస్ ఏమన్నారంటే..?

తాను ఎప్పటికీ కాంగ్రెస్ వాదిని అని.., కానీ ప్రస్తుతం తన వయస్సు ఆరోగ్యం దృష్ట్యా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండదలుచుకున్నట్లు ఈ రోజు డీఎస్ పేరుతో లేఖ విడుదలైంది. ఆయన భార్య సైతం ఓ లేఖ విడుదల చేశారు.

D Srinivas: తండ్రితో లైవ్‌లో ఫోన్ మాట్లాడిన సంజయ్.. డీఎస్ ఏమన్నారంటే..?
Dharmapuri Sanjay
Ram Naramaneni
|

Updated on: Mar 27, 2023 | 6:21 PM

Share

డీ శ్రీనివాస్ పెద్ద  కుమారుడు సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. డీఎస్‌పై కుట్ర జరుగుతోందని చెప్పారు. ఆయనకు ప్రాణ హాని ఉందని.. చుట్టూ ఉన్న వాళ్లపై తనకు అనుమానం ఉందన్నారు. ఎంపీ అర్వింద్‌ తండ్రిని బ్లాక్‌ మెయిల్ చేసి.. రాజీనామా లేఖపై సంతకం చేయించారని ఆయన ఆరోపించారు. అర్వింద్ బెదిరించి ఆస్తులు కూడా రాయించుకున్నాడని పేర్కొన్నారు. తాజాగా తన తండ్రిలో లైవ్‌లో ఫోన్ మాట్లాడారు సంజయ్. ఈ సందర్భంగా తనకు ప్రస్తుతం ఇబ్బంది ఏం లేదు కానీ.. రాజీనామా చేసేవరకు తనను హెరాస్‌ చేసినట్లు ఫోన్ కాల్‌లో చెప్పారు డీఎస్.

దీంతో డీఎస్‌కు ధైర్యం చెప్పారు సంజయ్. కొన్ని వందల ఫ్యామిలీలు మనకు అండగా ఉన్నాయని డీఎస్‌తో చెప్పుకొచ్చారు సంజయ్. “మీరో లెజెండ్. ధైర్యంగా ఉండండి డాడీ.  ఒక్క ఫోన్ కాల్ చేస్తే.. వేల మంది ఇంటికి వస్తారు. నువ్వు సంపాదించిన పెద్ద సైన్యం నీతో ఉంది. ఒక్క సెకన్ కూడా భయపడాల్సిన అవసరం లేదు” అంటూ డీఎస్‌తో ఫోన్‌లో మాట్లాడారు ధర్మపురి సంజయ్. చివర్లో నువ్వు నవ్వితే ఫోన్ కట్ చేస్తానని సంజయ్ చెప్పగా.. డీఎస్ బిగ్గరగా నవ్వడం వినిపించింది.

కాగా ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరిన సీనియర్ నేత డి. శ్రీనివాస్ సోమవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు లేఖ పంపారు. డీఎస్ భార్య విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ నేతలకు మరో లేఖ రాశారు. ఇది పాలిటిక్స్ చేసే సమయం కాదని.. తన భర్తను పార్టీలో చేర్చుకునే విధానం కూడా ఇది కాదన్నారు. చేతులు జోడించి దండం పెడుతున్నా.. కాంగ్రెస్ వాళ్లు ఇంకోసారి ఇటువైపు రాకండి. ఆయనను కొంచెం ప్రశాంతంగా బతకనీయండి అంటూ లేఖలో పేర్కొన్నారు విజయలక్ష్మీ.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.