Telangana: పాలమూరు జిల్లాలో శివ దీక్షలు.. వేలాదిమంది భక్తుల మాలధారణ

పాలమూరు జిల్లాలో శివనామస్మరణతో ఆలయాలు పులకించిపోతున్నాయి. భక్తులు మాలధారణ స్వీకరించటంతో నియమ, నిష్ఠలతో పూజలు చేస్తున్నారు. జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాల్లో ఆదివారం నుంచి శివదీక్షలు ప్రారంభయమ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేల మంది భక్తులు శివమాల స్వీకరించారు

Telangana: పాలమూరు జిల్లాలో శివ దీక్షలు.. వేలాదిమంది భక్తుల మాలధారణ
Lord Shiva

Edited By: Basha Shek

Updated on: Jan 30, 2024 | 6:53 AM

పాలమూరు జిల్లాలో శివనామస్మరణతో ఆలయాలు పులకించిపోతున్నాయి. భక్తులు మాలధారణ స్వీకరించటంతో నియమ, నిష్ఠలతో పూజలు చేస్తున్నారు. జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాల్లో ఆదివారం నుంచి శివదీక్షలు ప్రారంభయమ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేల మంది భక్తులు శివమాల స్వీకరించారు. శివమాలధారణ నేపథ్యంలో ఉమ్మడి శైవ క్షేత్రాలు మాలాధారణతో రద్దీగా మారాయి. ప్రతీ సంవత్సరం మహాశివరాత్రిని పురస్కరించుకొని 41రోజుల ముందుగా శివభక్తులు దీక్ష తీసుకొని స్వామివారిని కొలుస్తూంటారు. ప్రతిఏటా శివమాల ధరించే భక్తుల సంఖ్య పెరుగుతుందని ఆలయాల అర్చకులు చెబుతున్నారు. పురాణాలు, ఇతిహాసాల్లో శివదీక్షను ప్రస్తావించారని తెలిపారు.

మొత్తం 41రోజులపాటు దీక్ష

శివదీక్షను ఆచరిస్తున్న భక్తులు 41రోజుల పాటు అత్యంత నియమ, నిష్ఠలతో దీక్ష చేపడతారు. నేలపైనే నిద్రించడం, ఒక్కపూట భోజనం, ప్రతీరోజు తెల్లవారుజామునే నిద్రలేవడం, సూర్యోదయానికి ముందే స్నానం ఆచరిస్తుంటారు. క్రమం తప్పకుండా శివాలయాల సందర్శించడం, పూజలు, అభిషేకాలు నిర్వహిస్తూంటారు. ఇతరులను శివ నామముతో సంభోదిస్తుంటారు. అలాగే దీక్ష పూర్తయ్యేవరకు గంధపు రంగుల వస్ర్తాలు ధరిస్తారు. నుదుటిపై గంధం బొట్టు, మెడలో పరమశివుడు ధరించే మాదిరిగా రుద్రాక్షమాలను, రాగి, వెండి, బంగారం లోహాలతో స్వామివారి ముద్రికను మెడలో వేసుకుంటారు. దీక్షా కాలమంతా కాళ్ళకు పాదరక్షలు లేకుండా ఉంటారు. రోజులో రెండు లేదా మూడు సార్లు స్నానం చేసి స్వామి వారికి పూజలు నిర్వహిస్తారు. సాయంత్రాలు మాలాధారులంతా ఒకచోటకు చేరి భజనలు చేస్తుంటారు. కొంతమంది శివమాలాధారులు సన్నిధానంలోనే నిద్రించడం వంటి నియమాలు ఆచరిస్తారు.

శివదీక్షలతో గ్రామాల్లో భజనలు, అన్నదానాలతో హోరెత్తుతున్నాయి. ఏ శివుడి గుడి చూసిన పూజలు, భజనలతో కోలహలంగా కనిపిస్తున్నాయి. దీక్షను స్వీకరించటంతో మానసిక ప్రశాంతత, దైవ చింతన మరింత పెంపొందించేందుకు దోహదపడుతుంది. నిత్యం దైవ నామస్మరణలో ఉండటంతో, శాంతియుతంగ, మనసు ఎంతో నిర్మలంగా మారుతుందని భక్తులు నమ్ముతుంటారు. 41రోజుల శివదీక్షతో ఆధ్యాత్మిక చింతన మరింత పెరుగుతుందని విశ్వసిస్తారు

ఇవి కూడా చదవండి

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..