Batti Vikramarka: విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన ఉపముఖ్యమంత్రి భట్టి..

| Edited By: Srikar T

Feb 01, 2024 | 1:00 AM

ఇందిర‌మ్మ రాజ్యం స్థాప‌న‌లో భాగంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం విద్య వ్యవ‌స్థను బ‌లోపేతం చేసేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఉప ముఖ్యమంత్రి మ‌ల్లు భ‌టి విక్రమార్క తెలిపారు. బుధవారం డా. బిఆర్ అంబేద్కర్ స‌చివాల‌యంలో 2024-25 వార్షిక బ‌డ్జెట్‌కు సంబంధించి విద్య శాఖ రూపొందించిన ప్రతిపాద‌న‌ల‌పై మంత్రి పొన్నం ప్రభాక‌ర్‌తో క‌లిసి అధికారుల‌తో సమీక్ష నిర్వహించారు.

Batti Vikramarka: విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన ఉపముఖ్యమంత్రి భట్టి..
Deputy Cm Batti Vikramarka
Follow us on

ఇందిర‌మ్మ రాజ్యం స్థాప‌న‌లో భాగంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం విద్య వ్యవ‌స్థను బ‌లోపేతం చేసేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఉప ముఖ్యమంత్రి మ‌ల్లు భ‌టి విక్రమార్క తెలిపారు. బుధవారం డా. బిఆర్ అంబేద్కర్ స‌చివాల‌యంలో 2024-25 వార్షిక బ‌డ్జెట్‌కు సంబంధించి విద్య శాఖ రూపొందించిన ప్రతిపాద‌న‌ల‌పై మంత్రి పొన్నం ప్రభాక‌ర్‌తో క‌లిసి అధికారుల‌తో సమీక్ష నిర్వహించారు. విద్యా శాఖ‌లో అమ‌ల‌వుతున్న ప‌థ‌కాలు, విద్య వ్యవ‌స్థ నిర్వహ‌ణ గురించి అధికారులు ఈసంద‌ర్భంగా ప‌వ‌ర్ పాయింట్ ప్రజేంటేష‌న్ చేశారు.

ఆనంత‌రం స‌మీక్షలో డిప్యూటీ సీఎం భ‌ట్టి మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నిక‌ల ముందు ప్రజ‌ల‌కు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలులో భాగంగా ప్రతి మండ‌లంలో ఇంట‌ర్ నేష‌న‌ల్ స్కూల్ ఏర్పాటుకు క‌స‌ర‌త్తు చేస్తున్నామ‌ని చెప్పారు. ఇంట‌ర్ నేష‌న‌ల్ స్కూల్స్ ఏర్పాటు కోసం కావాల్సిన భూముల‌ను గుర్తించాల‌ని అధికారుల‌కు అదేశాలు ఇచ్చామ‌న్నారు. విద్యా బోధ‌న‌, వ‌స‌తుల క‌ల్పన గురించి విద్య శాఖ ఉన్నతాధికారుల‌ను ఆధ్యయ‌నం చేసి నివేదిక ఇవ్వాల‌ని కోరారు. ప్రయివేటుకు దీటుగా ప్రభుత్వ యూనివ‌ర్శిటీల్లో ఉపాధి కోర్సుల‌ను తీసుకురావాల‌ని సూచించారు. యూనివ‌ర్శీటీల నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన వారు ఉద్యోగాలు పొందే విధంగా కోర్సులు ఉండాల‌న్నారు.

ప్రపంచీక‌ర‌ణ నేప‌థ్యంలో ప్రయివేటు వ‌ర్సీటీల్లో ఏం కోర్సులు ఉన్నాయి? మ‌న వ‌ద్ద వాటిని ఏలా అభివృద్ది చేయాల‌న్నదానిపై ఆలోచ‌న చేయాల‌న్నారు. ఖ‌మ్మం, ఆదిలాబాద్ జిల్లాలో యూనివ‌ర్సిటీలు లేనందున ఏర్పాటుకు ప్రణాళిక‌లు సిద్దం చేయాల‌న్నారు. అనుమ‌తులు లేకుండా కొన్ని ప్రయివేటు యూనివ‌ర్సీటీలు అడ్మిష‌న్‌లు ఇచ్చి పిల్లల భ‌విత‌వ్యాన్ని ప్రశ్నార్ధకంగా మార్చిన వారిపై ఏలాంటి చ‌ర్యలు తీసుకున్నార‌ని అడిగారు. ఇంట‌ర్మీడియట్ బోర్డు మార్గ ద‌ర్శకాలు, నిబంధ‌న‌ల ప్రకారం విద్య సంస్థల నిర్వహణ ఉండేలా అధికారులు ప‌ర్యవేక్షణ చేయాల‌న్నారు. నిబంధ‌న‌లు పాటించ‌ని కళ‌శాల‌ల‌పై క‌ఠిన చ‌ర్యలు తీసుకోవాల‌న్నారు.

ఇవి కూడా చదవండి

రాష్ట్ర వ్యాప్తంగా ఇంట‌ర్ విద్యా సంస్థల‌ను త‌నిఖీలు చేసి నివేదిక ఇవ్వాల‌న్నారు. ఈ విష‌యంలో అధికారులు ఉదాసీనంగా వ్యవ‌హ‌రిస్తే ఉపేక్షించ‌మ‌న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠ‌శాలలకు విద్యుత్ సౌక‌ర్యం క‌ల్పించ‌డానికి సోలార్ విద్దుత్తు ఉత్పత్తి చేయ‌డానికి ఆ భ‌వ‌నాల‌ను విద్యుత్తు శాఖ‌ ప్రిన్సిప‌ల్ సెక్రట‌రికి అప్పంగించాల‌న్నారు. బాస‌ర త్రిబుల్ ఐటి నిర్వహ‌ణ గురించి ఆరా తీశారు. విద్యార్థుల త‌ల్లిందండ్రులు ఆసంతృప్తి చేయ‌డానికి కార‌ణాలు ఏంట‌ని అడిగారు. రాష్ట్రంలో మ‌రో త్రిపుల్ ఐటీ అవ‌స‌రం ఉందా అని అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు.

రాష్ట్రంలో 84 శాతం జ‌నాభా ఉన్న నిరుపేద‌లను దృష్టిలో పెట్టుకొని పాల‌సీలు రూపొందించాల‌ని అధికారుల‌కు సూచించారు. క‌నీస వ‌స‌తులు లేన‌టువంటి విద్యా సంస్థలు సైతం వేల‌ల్లో ఫీజులు వ‌సూలు చేస్తున్నాయ‌ని వీటి నియంత్రణ చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. పాఠ‌శాల‌ మొద‌లు యూనివర్సీటీల వ‌ర‌కు ఫీజుల నియంత్రణ‌కు ముసాయిదా సిద్ధం చేస్తే బ‌ల‌మైన చ‌ట్టం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప‌రిశీలిస్తుంద‌న్నారు. ప్రభుత్వ పాఠ‌శాల‌లో డిజిట‌ల్ క్లాస్ గ‌దులు ఏర్పాటుకు టెండ‌ర్లు ప‌లిచి ఆరు నెల‌లైన ఎందుకు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయ‌లేక‌పోయార‌ని అడిగారు. ఈ స‌మావేశంలో ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యద‌ర్శి రామ‌కృష్ణా రావు, విద్యశాఖ ప్రిన్సిప‌ల్ సెక్రట‌రి బుర్ర వెంక‌టేశం, క‌మిష‌న‌ర్ శ్రీ దేవ‌సేన‌, ఫైనాన్స్ శాఖ జాయింట్ సెక్రట‌రీ హ‌రిత‌, డిప్యూటి సీఎం సెక్రట‌రీ కృష్ణభాస్కర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..