Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఆ రోడ్డులో వెళ్లారంటే డైరెక్ట్ యమలోకానికి పార్శిల్ పక్కా.. ఎక్కడుందంటే.?

వరంగల్ - కరీంనగర్ మద్య NH 563పై రక్తం రుచి మరిగిన ఆ స్పాట్ సమీపిస్తుందంటే చాలు వాహనదారుల వెన్నులో వణుకుపడుతుంది.. ఆ డేంజర్ డెత్ స్పాట్ దాటామంటే వైకుంఠపాలిలో గట్టెక్కినట్లే... ఇంతకీ వాహనదారుల వెన్నులో వనుకు పుట్టించే ఆ డెంజర్ స్నేక్ స్పాట్ ఎక్కడుంది..!

Telangana: ఆ రోడ్డులో వెళ్లారంటే డైరెక్ట్ యమలోకానికి పార్శిల్ పక్కా.. ఎక్కడుందంటే.?
Representative Image
Follow us
G Peddeesh Kumar

| Edited By: Ravi Kiran

Updated on: Apr 03, 2025 | 1:32 PM

సగటున ఏడాదికి 15 మంది ప్రాణాలు మింగేస్తున్న డేంజర్ స్పాట్ ఇది. వరంగల్ – కరీంనగర్ మద్య జాతీయ రహదారి హసన్ పర్తి శివారు నుండి సీతంపేట క్రాస్ వరకు అత్యంత ప్రమాదకరంగా ప్రాణాలు మింగేస్తున్న ఈ మూల మలుపు ఇది. రక్తం రుచి మరిగిన డేంజర్ డెక్స్ పార్ట్ ని వాహనదారులు ఇక్కడి ప్రజలు స్నాక్స్ పాటుగా పిలుస్తుంటారు.. వైకుంఠపాళీ లో పాము మింగేసినట్లే ఇక్కడ వాహనదారుల ప్రాణాలను ఈ డేంజరస్ పాట మింగేస్తుంది.

తాజాగా మూడు రోజులు వ్యవధిలో ముగ్గురు ఇదే ప్రాంతంలో ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోవడం స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది..రెండు రోజుల క్రితం జరిగిన ఓ ప్రమాదంలో మహేష్, పవన్ అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు ఇక్కడే నిండు ప్రాణాలు కోల్పోయారు. సీతంపేట గ్రామానికి చెందిన మహేష్, పవన్ బైక్ పై వెళ్తుండగా లారీ డీ కొని అక్కడిక్కడే నిండు ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలు బోరున విలపిస్తున్నాయి. అయితే రహదారిపై కొద్దిదూరంలో శాంతినగర్ వద్ద కీర్తి అనే యువతి రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. బైక్‌పై వెళ్తుండగా లారీ ఢీకొని కీర్తి కొంతసేపు మృత్యువుతో పోరాడింది. స్థానికులు ఆస్పత్రికి తరలించేలోపే నిండు ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసి పోయాయి.

వరుస ప్రమాదాల నేపథ్యంలో స్థానికులు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు.. ప్రమాదాల నివారణకు వెంటనే చర్యలు చేపట్టాలని స్థానికులు అర్థనగ్న ప్రదర్శన చేపట్టారు.. చిన్న చిన్న కారణాలతో వాహనదారులకు జరిమానాలు వేసి ముక్కు పిండి వసూలుచేసే రవాణాశాఖ అధికారులు, పోలీసులకు ప్రమాదాల నివారణ పై ముందు జాగ్రత్త, బాధ్యత లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ జరిగిన ప్రమాదాలకు లెక్కేలేదు… ఈ రోడ్డు గురించి తెలిసిన వారు ఎవరైనా ఈ డేంజర్ డెత్ స్పాట్ నుండి సురక్షితంగా బయటపడితే ప్రశాంతంగా ఇంటికి చేరినట్లే అని మనసులో దేవుడిని తలుచుకుంటారట. అచ్చం పాము మెలికల లాగే ఉండే ఈ రహదారిని స్థానికులు స్నేక్స్ స్పాట్ గా పిలుస్తుంటారు. ఏళ్ల తరబడి ఇక్కడ ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి.. ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా ఎంతమంది బలవుతున్న అధికారులు ప్రజాప్రతినిధుల్లో చలనం లేదు. కేవలం ఈ ప్రాంతంలో డివైడర్లు ఏర్పాటు చేస్తే ప్రమాదాల నివారించవచ్చని స్థానికులు అంటున్నారు.

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..