Munugode ByPoll: టీఆర్ఎస్ గెలుపులో కీలక పాత్ర పోషించింది వారే.. లేదంటే ఫలితం తారుమారే..?

మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ ఎస్ విజయం సాధించి.. జాతీయ పార్టీని ప్రకటించిన తర్వాత కేసీఆర్ తొలి విజయాన్ని దక్కించుకున్నారు. టీఆర్ ఎస్ పార్టీకి ఇది చివరి విజయం కాగా.. అధికారికంగా బీఆర్ఎస్ పార్టీ తరపున మునుగోడులో పోటీచేయనప్పటికి.. జాతీయ రాజకీయాల్లోకి..

Munugode ByPoll: టీఆర్ఎస్ గెలుపులో కీలక పాత్ర పోషించింది వారే.. లేదంటే ఫలితం తారుమారే..?
Cpi
Follow us

|

Updated on: Nov 06, 2022 | 8:07 PM

మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ ఎస్ విజయం సాధించి.. జాతీయ పార్టీని ప్రకటించిన తర్వాత కేసీఆర్ తొలి విజయాన్ని దక్కించుకున్నారు. టీఆర్ ఎస్ పార్టీకి ఇది చివరి విజయం కాగా.. అధికారికంగా బీఆర్ఎస్ పార్టీ తరపున మునుగోడులో పోటీచేయనప్పటికి.. జాతీయ రాజకీయాల్లోకి అరంగ్రేటం చేస్తూ.. పార్టీ పేరు మార్పును ప్రకటించిన తర్వాత కేసీఆర్ కు తొలి విజయంగా చెప్పుకోవచ్చు. అయితే టీఆర్ఎస్ విజయంలో ఆ పార్టీ శ్రేణులు కృషి, శ్రమ ఎక్కువుగానే ఉండొచ్చు.. కాని టీఆర్ ఎస్ మెజార్టీ చూసిన తర్వాత మాత్రం గులాబీ పార్టీ.. వారికి కృతజ్ఞతలు చెప్పాల్సిందే.. ఆ పార్టీ అభ్యర్థులు ఎన్నికల్లో పోటీచేసి ఉంటే ఫలితం ఏ విధంగా ఉండేదో అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. దీనిని ముందే పసిగట్టిన కేసీఆర్.. ఉభయ కమ్యూనిస్టు పార్టీల మద్దతు కూడగట్టారంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పుడు కారు పార్టీ నాయకులతంఆ థ్యాంక్స్‌ టు కామ్రేడ్స్ అంటున్నారు. గులాబీ విజయోత్సవంలో ఎక్కువుగా పదం కూడా ఇదే. గులాబీ జెండా పక్కనే ఎర్రజెండాక్కూడా చోటు దొరకడం మునుగోడు ఫలితాన్ని పూర్తిగా ప్రభావితం చేసింది. ఓ రకంగా చెప్పాలంటే మునుగోడు ఫలితంలో కామ్రేడ్ల పార్ట్ చాలా కీలకం. కమ్యూనిస్టుల ఖాతాలో ఉన్న సంప్రదాయక ఓట్లన్నీ కారు గుర్తు మీద పడ్డం… మునుగోడులో కారు జోరుకు మెయిన్ రీజన్‌గా తెలుస్తుంది. రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో ఇక ఉపఎన్నిక తప్పదన్న వార్తలు వచ్చీ రాగానే… మునుగోడులో కమ్యూనిస్టుల దారెటు… ఎర్రజెండా ఏమవుతుంది… అనే డౌట్లు మొదలైపొయ్యాయి.

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని లీడ్ చేసిన భారత కమ్యూనిస్టు పార్టీ అప్పట్లో తెలంగాణలో నిర్మించుకున్న కంచుకోటల్లో మునుగోడు కూడా ఒకటి. 12 సార్లు ఎన్నికలు జరిగితే ఐదుసార్లు సీపీఐకి పట్టం కట్టారు మునుగోడు ప్రజలు. అంటే… షుమారు పాతికేళ్ల పాటు మునుగోడు తరఫున అసెంబ్లీలో ఎర్రజెండానే ఎగిరింది. ఇక్కడ ప్రతీ మండలంలోనూ కమ్యూనిస్టులకంటూ ప్రత్యేకమైన ఓటుబ్యాంకుంది. మొత్తం నియోజవర్గంలో ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కమ్యూనిస్టులకు 20 వేల ఓట్లుంటాయన్నది ఒక లెక్క. సిద్ధాంతపరంగా బీజేపీకి బద్ధశత్రువులం కనుక.. ఏ ఒక్క చోటా కమలనాథుల్ని ఎంటర్‌టైన్‌ చెయ్యకుండా… దారికి అడ్డం నిలబడాలన్నది కమ్యూనిస్టు పార్టీల కమిట్‌మెంట్. తెలంగాణాలో సెక్యులరిజాన్ని కాపాడుకోవాలంటే ఇదొక్కటే మార్గం అనుకుని… కేసీఆర్‌తో జత కట్టారు సీపీఐ, సీపీఏం పార్టీలు. ఈ కలకయికను అడ్డుకోడానికి తెలంగాణా బీజేపీ ఆఖరివరకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. టీఆర్ఎస్ విజయం ఖాయమైన తర్వాత రాజగోపాల్ మాటల్లో కూడా అదే ధ్వనించింది. ప్రచారంలో కూడా టీఆర్‌ఎస్ క్యాడర్‌తో కలిసిమెలిసి పనిచేసింది కమ్యూనిస్టు పార్టీ. బహిరంగ సభల్లో కూడా కేసీఆర్… ప్రత్యేకంగా కమ్యూనిస్టుల గొప్పతనాన్ని చెబుతూ.. వాళ్ల ఓటు బ్యాంకుని ఎట్రాక్ట్ చేసేందుకు ట్రై చేశారు.

దశాబ్దాలు దాటినా… రాజకీయ పరిస్థితులు మారినా, కొత్తకొత్త పార్టీలు వచ్చినా మునుగోడులో కమ్యూనిస్టులు ఉనికి చాటుతూనే ఉన్నారు. గతంలో ఉన్నంత వైభవం కాకపోయినా… గెలుపోటముల్ని ప్రభావితం చేస్తూనే ఉన్నారు. 2014లో విడివిడిగా పోటీచేసి… ఇద్దరు అభ్యర్థుల్ని పోటీలో దింపినా సత్తా చాటారు కమ్యూనిస్టులు. సీపీఐ 20,952 ఓట్లు, సీపీఎంకి 9,206 ఓట్లు… టోటల్‌గా 30 వేల ఓట్లు రాబట్టుకున్నారు కామ్రేడ్ అభ్యర్థులు. అందుకే… కమ్యూనిస్టుల ఓటు బ్యాంకుని తేలిగ్గా తీసుకోకుండా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని మునుగోడులో కమ్యూనిస్టుల్ని కలుపుకుని యుద్ధంలో దిగారు కేసీఆర్. దానికి తగ్గ ఫలితాన్ని ఎంజాయ్ చేశారు గులాబీ బాస్.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో