Couple Suicide: హైదరాబాద్‌ గోల్నాకలో విషాదం.. పిల్లలు పుట్టలేదనే కారణంతో ఇద్దరు దంపతులు..

|

Jan 25, 2021 | 10:44 PM

Couple Suicide: హైదరాబాద్‌లోని గోల్నాకలో విషాదం చోటు చేసుకుంది. పిల్లలు లేరనే కారణంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఇద్దరు దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Couple Suicide: హైదరాబాద్‌ గోల్నాకలో విషాదం.. పిల్లలు పుట్టలేదనే కారణంతో ఇద్దరు దంపతులు..
Follow us on

Couple Suicide: హైదరాబాద్‌లోని గోల్నాకలో విషాదం చోటు చేసుకుంది. పిల్లలు లేరనే కారణంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఇద్దరు దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాచిగూడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రాములు(55), గౌరి(50) దంపతులు గోల్నాకలో పూల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఈ దంపతులకు ఇప్పటి వరకు సంతానం కలగలేదు. పైగా ఇప్పుడు వయసు మీదపడుతుండటంతో అనారోగ్య సమస్యలు కూడా తోడయ్యాయి. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన దంపతులు.. ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న కాచిగూడ పోలీసులు.. మృతదేహాలను పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం దంపతులిద్దరి మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

Corona Vaccination: దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న కోవిడ్‌ టీకా పంపిణీ.. ఇప్పటి వరకు 19.5 లక్షల మందికి వ్యాక్సినేషన్‌

Urvashi Rautela: ఊర్వశి రౌతెలా ధరించిన డ్రెస్ ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంక్ అవుతుంది..