Lovers Sucide : నిజమాబాద్ జిల్లా కుదావంద్‌పూర్‌లో దారుణం.. పెళ్లి విషయంలో తేడా రావడంతో ఓ ప్రేమజంట ఇలా చేసింది..
Lovers Sucide : పెళ్లి విషయంలో అభిప్రాయ భేధాలు రావడంతో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిజమాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
Lovers Sucide : పెళ్లి విషయంలో అభిప్రాయ భేధాలు రావడంతో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిజమాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. కుదావంద్‌పూర్‌లో జరగిని ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నందిపేట మండలం కుదావంద్‌పూర్ గ్రామానికి చెందిన సుకన్య, ఐలాపూర్ గ్రామానికి చెందిన ప్రేమ్ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఆదివారం రాత్రి వీరిద్దరూ ఫోన్ ఛాటింగ్ చేసుకున్నారు.
ఆ సమయంలో వీరిద్దరూ పెళ్లి చేసుకునే విషయంలో చిన్నపాటి గొడవ జరగింది. ఇద్దరికి అభిప్రాయ భేధాలు రావడంతో మనస్తాపానికి గురైన యువతి తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ప్రేయసి ఆత్మహత్య చేసుకుందన్న విషయం తెలిసిన ప్రేమ్ తన స్వగ్రామంలోని చెరువు వద్ద ఉన్న చెట్టుకు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.