Telangana Corona: తెలంగాణలో తగ్గిన కరోనా సెకండ్ వేవ్ తీవ్రత.. అలాగని ఆదమరిచారో అంతే సంగతులు..

Telangana Corona: తెలంగాణలో తగ్గిన కరోనా సెకండ్ వేవ్ తీవ్రత.. అలాగని ఆదమరిచారో అంతే సంగతులు..
Telangana Health Director S

Telangana: తెలంగాణ లో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత తగ్గింది... అలా అని జాగ్రత్తలు మరిస్తే థర్డ్ వేవ్ ముప్పు తప్పదు అంటున్నారు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు.

Shiva Prajapati

|

Aug 19, 2021 | 9:43 AM

Telangana: తెలంగాణ లో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత తగ్గింది… అలా అని జాగ్రత్తలు మరిస్తే థర్డ్ వేవ్ ముప్పు తప్పదు అంటున్నారు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు. థర్డ్ వేవ్ వస్తే ఎరుర్కోవడనికి సిద్దంగా ఉన్నాం అని అంటూనే ప్రజలు జాగ్రతగా ఉండడం అవసరం అని గుర్తుచేస్తుంది తెలంగాణ వైద్య శాఖ.

‘‘పది రోజుల నుండి తెలంగాణలో కరోనా కేసులు అదుపులోకి వస్తున్నాయ్.. కొన్ని జిల్లాలో అసలు కరోనా కేసులు కూడా నమోదు అవడం లేదు. కానీ ఆదమరిస్తే ప్రమాదం తప్పదు’’ అని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ముగిసిపోయిందని, కానీ థర్డ్‌ వేవ్‌ రాకుండా కోవిడ్‌ మార్గదర్శకాలను పాటించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. కరోనా కేసులు తగ్గినా పోస్ట్ కోవిడ్ సమస్యలు ఎక్కువ మంది నీ వెంటాడుతుందన్నారు. కాబట్టి శరీరంలో వచ్చే ఎలాంటి మార్పు అయినా తేలిగ్గా తీసుకోవద్దు అని సూచించారు.

ఇక వర్షాలు పడుతుండడంతో జ్వరాలు, ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయని, వాటి తో జాగ్రతగా ఉండాలని నిపుణులు సూచించారు. ప్రస్తుతం తెలంగాణలో డెంగీ, మలేరియా కేసులు పెరుగుతున్నాయి. గతేడాది రాష్ట్రంలో 2,173 డెంగీ కేసులు నమోదైతే, ఈ ఏడాది ఇప్పటికే 1,200 నమోదయ్యాయి అని తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ వెల్లడించారు. ఇందులో 448 డెంగీ కేసులు హైదరాబాద్‌లో నమోదయ్యాయన్నారు. హైదరాబాద్ తో పాటు ఖమ్మం జిల్లాల్లో డెంగీ కేసులు అత్యధికంగా రాగా, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలో మలేరియా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి అని శ్రీనివాస్ రావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 220, ములుగు జిల్లాలో 120పైగా మలేరియా కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు.

ఎవరికైనా అనారోగ్యంగా అనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచించారు. పెద్ద ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా ఫీవర్‌ క్లినిక్‌లను ఏర్పాటు చేశామని, డెంగీ చికిత్స కోసం 24 ప్లేట్‌లెట్‌ ఎలక్ట్రిక్‌ యంత్రాలను సిద్ధంగా ఉంచామని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. పరిసరాల్లో నీళ్లు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. డెంగీ దోమ పగటి వేళలోనే కుడుతుందని, అందువల్ల ఇళ్లలోకి దోమలు రాకుండా చూసుకోవాలని ప్రజలకు సూచించారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu