తెలంగాణలో 600 మంది ఎస్‌బీఐ ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌.. ఉద్యోగుల కోసం ప్రత్యేక కోవిడ్‌ వ్యాక్సిన్‌ డ్రైవ్‌

SBI Employees: దేశంలో మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా సెకండ్‌వేవ్‌లో భాగంగా గతంలో కంటే రెట్టింపు పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో..

  • Subhash Goud
  • Publish Date - 10:14 pm, Wed, 21 April 21
తెలంగాణలో 600 మంది ఎస్‌బీఐ ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌.. ఉద్యోగుల కోసం ప్రత్యేక కోవిడ్‌ వ్యాక్సిన్‌ డ్రైవ్‌
Sbi Employees

SBI Employees: దేశంలో మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా సెకండ్‌వేవ్‌లో భాగంగా గతంలో కంటే రెట్టింపు పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో తమ సంస్థకు చెందిన 600 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు ఎస్‌బీఐ సీజీఎం ఓపీ మిశ్రా తెలిపారు. కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. ఖాతాదారులు నేరుగా సంబంధాలు ఉన్న ఉద్యోగులే కోవిడ్‌ బారిన పడినట్లు గుర్తించామన్నారు. గురువారం నుంచి ఏప్రిల్‌ 30 వరకు సగం మంది ఉద్యోగులే బ్యాంకుల్లో విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని కోఠి, సికింద్రాబాద్‌ ఎస్‌బీఐ కార్యాలయాల్లో ఉద్యోగుల కోసం ప్రత్యేక కోవిడ్‌ వ్యాక్సిన్‌ డ్రైవ్‌ ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. అయితే కరోనా మహమ్మారి సామాన్యుల నుంచి ప్రముఖులు, ఇలా ఉద్యోగుల వరకు ఎవ్వరిని వదిలి పెట్టడం లేదు. రోజురోజుకు తీవ్ర స్థాయిలో కేసులు నమోదు కావడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది.

కాగా, తాజాగా తెలంగాణలో గడిచిన 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 6,542 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 20 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,67,901 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,876కి చేరింది.

ఇవీ చదవండి: Migrant workers: మళ్లీ మొదలైన వలస కూలీల కష్టాలు.. ముల్లెమూట సర్దుకుని స్వస్థలాలకు పయనమవుతున్న వలస జీవులు

మీకు ఎస్‌బీఐలో రుణాలు ఇప్పిస్తామని ఫోన్‌లు వస్తున్నాయా..? అయితే తస్మాత్‌ జాగ్రత్త…వెలుగులోకి వస్తున్న మోసాలు