CM KCR: యశోద ఆస్పత్రిలో కేసీఆర్‌కు వైద్య పరీక్షలు…ఎటువంటి ఇన్ఫెక్షన్లు లేవన్న వైద్యులు

CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమాజిగూడ యశోధ ఆస్పత్రిలో సిటి స్కాన్ మరియు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యక్తిగత వైద్యులు..

CM KCR: యశోద ఆస్పత్రిలో కేసీఆర్‌కు వైద్య పరీక్షలు...ఎటువంటి ఇన్ఫెక్షన్లు లేవన్న వైద్యులు
Cm Kcr
Follow us

|

Updated on: Apr 21, 2021 | 9:47 PM

CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో సిటి స్కాన్ మరియు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యక్తిగత వైద్యులు ఎం. వి. రావు ఆధ్వర్యంలో ఈ పరీక్షలను నిర్వహించారు. కేసీఆర్‌ ఊపిరితిత్తులు సాధారణంగా ఉన్నాయని, ఎటువంటి ఇన్పెక్షన్ లేదని డాక్టర్లు తెలిపారు. సాధారణంగా నిర్వహించే రక్త పరీక్షల నిమిత్తం కొన్ని రక్త నమూనాలను సేకరించారు. రక్త పరీక్షలకు సంబంధించిన రిపోర్టులు రేపు రానున్నాయి. ముఖ్యమంత్రి ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలో కోలుకుంటారని ఆయన వెల్లడించారు. దాదాపు 40 నిమిషాల పాటు వివిధ పరీక్షలు నిర్వహించారు.

కాగా, కరోనా వైరస్‌ బారిన పడిన కేసీఆర్‌.. మూడు రోజులుగా ఫాంహౌస్ లోనే ఉంటూ చికిత్స పొందున్నారు. ఎర్రవెల్లి ఫామ్‌ హౌస్‌లో హోం ఐసోలేషన్‌లో ఉన్న ఆయనకు వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు నేతృత్వంలోని యశోదా ఆస్పత్రి వైద్యుల బృందం చికిత్స అందిస్తోంది. కాగా, నిన్న రాష్ట్ర మంత్రి, ఆయన తనయుడు కేటీ రామారావు, కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌లు కేసీఆర్ ను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇదిలా ఉండగా, ఈనెల 19న కేసీఆర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ముఖ్యమంత్రికి కరోనా సోకిందని తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. ఆయన స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే వైద్య పరీక్షల నిమిత్తం యశోద ఆస్పత్రికి వెళ్లారు.

ఇవీ చదవండి: Telangana Rain: రానున్న మూడు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు.. హైదరాబాద్‌ వాతావరణ శాఖ

Morning Time: మీరు ఉదయం నిద్రలేవగానే ఈ పనులు చేయండి… రోజంతా హుషారుగా.. ఆరోగ్యంగా ఉంటారు